చాలాసార్లు ఎవరైనా వాట్సాప్‌లో మెసేజ్ పంపి, వెంటనే దానిని “Delete for Everyone” చేస్తుంటారు. అలాంటప్పుడు ఆ మెసేజ్‌లో ఏముందో తెలుసుకోవాలనే కుతూహలం మనకు కలుగుతుంది. దీనికోసం సాధారణంగా చాలా మంది థర్డ్-పార్టీ యాప్‌లను (Third-party apps) వాడుతుంటారు.
అయితే, అలాంటి యాప్స్ ఏవీ లేకుండానే డిలీట్ అయిన మెసేజ్‌లను చూసే ఒక సులువైన మార్గం ఉందని మీకు తెలుసా?
ఈ పద్ధతి మీ వాట్సాప్‌లో ‘చాట్ బ్యాకప్’ (Chat Backup) ఫీచర్ ఇదివరకే ఆన్‌లో ఉంటేనే పనిచేస్తుంది. ముఖ్యంగా, మెసేజ్ డిలీట్ కావడానికి ముందే బ్యాకప్ ప్రక్రియ పూర్తయి ఉండాలి. ఉదాహరణకు.. రాత్రి 8 గంటలకు ఒక మెసేజ్ వచ్చింది, 8:15 గంటలకు వాట్సాప్ ఆటోమేటిక్ బ్యాకప్ జరిగింది, ఆపై 8:30 గంటలకు అవతలి వ్యక్తి ఆ మెసేజ్‌ను డిలీట్ చేశాడనుకుందాం. అటువంటప్పుడు మీరు పాత బ్యాకప్‌ను రీస్టోర్ చేయడం ద్వారా ఆ మెసేజ్‌ను మళ్లీ చూడవచ్చు.
ఎలా చేయాలో స్టెప్-బై-స్టెప్ ప్రాసెస్:
స్టెప్ 1: చివరి బ్యాకప్ సమయాన్ని తనిఖీ చేయండి అందరికంటే ముందుగా మీ వాట్సాప్‌లో చివరి బ్యాకప్ ఎప్పుడు జరిగిందో చూసుకోండి.
- ఐఫోన్ (iPhone) యూజర్లు: వాట్సాప్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి ‘చాట్స్’ (Chats), ఆపై ‘చాట్ బ్యాకప్’ (Chat Backup) ఎంచుకోండి.
- ఆండ్రాయిడ్ (Android) యూజర్లు: సెట్టింగ్స్‌లోని ‘చాట్స్’లో ‘చాట్ బ్యాకప్’ ఆప్షన్‌ను చూడవచ్చు. డిలీట్ అయిన మెసేజ్ ఆ బ్యాకప్ సమయానికి ముందే వచ్చి ఉంటేనే దానిని తిరిగి పొందడం సాధ్యమవుతుంది.
స్టెప్ 2: యాప్‌ను అన్ఇన్స్టాల్ చేసి, మళ్లీ ఇన్స్టాల్ చేయండి బ్యాకప్ వివరాలను సరిచూసుకున్న తర్వాత, మీ ఫోన్ నుండి వాట్సాప్ యాప్‌ను డిలీట్ (అన్ఇన్స్టాల్) చేయండి. ఆ తర్వాత యాప్ స్టోర్ లేదా గూగుల్ ప్లే స్టోర్ నుండి యాప్‌ను మళ్లీ ఇన్స్టాల్ చేసుకోండి.
స్టెప్ 3: బ్యాకప్‌ను రీస్టోర్ చేయండి ఇన్స్టాలేషన్ పూర్తయిన తర్వాత మీ మొబైల్ నంబర్‌ను వెరిఫై చేయండి. ఆ వెంటనే వాట్సాప్ ఆటోమేటిక్‌గా పాత బ్యాకప్‌ను గుర్తిస్తుంది మరియు మీకు ‘Restore’ ఆప్షన్‌ను చూపిస్తుంది. దానిపై క్లిక్ చేయండి.
మీడియా ఫైల్స్ కూడా తిరిగి వస్తాయి.. కానీ ఒక చిన్న తిరకాసు!
మీరు బ్యాకప్‌ను ‘రీస్టోర్’ చేసినప్పుడు, డిలీట్ అయిన మెసేజ్ గనుక ఆ బ్యాకప్‌లో సేవ్ అయి ఉంటే, అది మీ చాట్‌లో మళ్లీ ప్రత్యక్షమవుతుంది. దీనితో పాటు ఫోటోలు, వీడియోల వంటి మీడియా ఫైల్స్ కూడా తిరిగి వస్తాయి. కానీ ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి; చివరి బ్యాకప్ తీసుకున్న తర్వాత మీకు వచ్చిన కొత్త మెసేజ్‌లు మాత్రం ఈ ప్రాసెస్ వల్ల డిలీట్ అయిపోతాయి (అవి రీస్టోర్ కావు).
ఈ ట్రిక్ ప్రతిసారీ 100% పనిచేస్తుందని చెప్పలేము. మీ ఫోన్లలో వాట్సాప్ బ్యాకప్ ఫీచర్ ముందు నుంచే ఆన్ చేసి లేకపోతే, డిలీట్ అయిన మెసేజ్‌లను తిరిగి పొందడం అస్సలు సాధ్యం కాదు. అందుకే, ముఖ్యమైన చాట్స్ మిస్ కాకుండా ఉండటానికి గూగుల్ డ్రైవ్ (Google Drive) లేదా ఐక్లౌడ్ (iCloud) లలో రెగ్యులర్ బ్యాకప్‌ను ఆన్‌లో ఉంచుకోవడం ఎల్లప్పుడూ మంచిది.
