ఢిల్లీ మెట్రో లిఫ్ట్‌లో వృద్ధుడి వింత ప్రవర్తన.. తీవ్రంగా అరిచిన యువతి! వీడియో వైరల్ అయ్యాక బయటపడ్డ అసలు నిజం!

ఢిల్లీ మెట్రో వైరల్ వీడియో: ఢిల్లీ మెట్రోకు సంబంధించిన అనేక దిగ్భ్రాంతికరమైన వీడియోలు తరచూ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం మీరు చూసే ఉంటారు. కొన్నిసార్లు మెట్రోలోనే అసభ్యకరంగా ప్రవర్తించడం, మరికొన్నిసార్లు గొడవలు పడటం.. ఆఖరికి మెట్రోను కాస్తా కపుల్స్ ప్లేస్‌గా మార్చేయడం వంటి ఘటనలు వెలుగుచూశాయి.

కాగా, ఇప్పుడు తాజాగా చూసేవారిని ఆశ్చర్యపరిచే మరో వీడియో సోషల్ మీడియాలోకి వచ్చింది. కాల్కాజీ మందిర్ మెట్రో స్టేషన్ నుండి ఒక అసహ్యకరమైన వీడియో బయటకు వచ్చింది. వైరల్ అవుతున్న ఈ వీడియోలో, ఒక వృద్ధుడు మెట్రో స్టేషన్ లిఫ్ట్ లోపల అసభ్యంగా ప్రవర్తిస్తుండగా ఒక యువతి పట్టుకుంది. అంతేకాదు ఆమె ఆ వృద్ధుడిపై గట్టిగా అరుస్తూ నిలదీసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో విపరీతంగా వైరల్ అవుతోంది. అయితే, ఈ వ్యవహారంలో ఢిల్లీ పోలీసులు స్పందించిన తర్వాత, అందరినీ ఆలోచింపజేసే ఒక అసలు నిజం వెలుగులోకి వచ్చింది.

లిఫ్ట్‌లో ఏం జరిగింది?
ఈ పూర్తి ఘటనకు సంబంధించిన వీడియోను దీపశిఖ మెహతా అనే మహిళ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. వైరల్ అవుతున్న ఆ క్లిప్‌లో, ఆమె కాల్కాజీ మందిర్ మెట్రో స్టేషన్ లిఫ్ట్ లోపల ఆ వృద్ధుడిని వీడియో తీస్తూ, గద్దించడాన్ని మనం చూడవచ్చు. దీపశిఖ తెలిపిన వివరాల ప్రకారం.. ఆమె ఇతర ప్రయాణికులతో కలిసి లిఫ్ట్ ఎెక్కినప్పుడు, ఆ వృద్ధుడు లిఫ్ట్ లోపల మూత్ర విసర్జన చేస్తూ కనిపించాడు. వీడియోలో ఆ యువతి.. “ఈయన లిఫ్ట్ లోపల, అదీ అమ్మాయిల ముందే మూత్ర విసర్జన చేసేశారు” అని అనడం వినిపిస్తుంది. ఆమె ఆ వృద్ధుడిని నిలదీసినప్పుడు, ఆయన చాలా ప్రశాంతంగా, నిర్లక్ష్యంగా.. “అవును, సరే, సారీ.. నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో” అని సమాధానమిచ్చారు. ఈ వీడియో బయటకు రాగానే, బహిరంగ పరిశుభ్రత మరియు పౌర బాధ్యతలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడిచింది.

వృద్ధుడు అలా ఎందుకు చేయాల్సి వచ్చింది? అసలు నిజమేంటి?
ఈ వీడియో వైరల్ అయి, ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైన తర్వాత ఢిల్లీ పోలీసులు ఈ వ్యవహారాన్ని పరిశీలించారు. అనంతరం సదరు ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ కామెంట్ సెక్షన్‌లో ఈ ఘటనకు సంబంధించిన అసలు వాస్తవాలను స్పష్టం చేశారు. పోలీస్ అధికారుల వివరణ ప్రకారం.. ఈ ఘటన 2026 మే 15 రాత్రి రాత్రి సుమారు 9:40 గంటల ప్రాంతంలో జరిగింది. ఆ వృద్ధ ప్రయాణికుడు జామియా మెట్రో స్టేషన్ నుండి ఫరీదాబాద్ వైపు ప్రయాణిస్తున్నారు.

కాల్కాజీ మందిర్ మెట్రో స్టేషన్‌లో రైలు మారే క్రమంలో (లైన్ చేంజ్ అవుతున్నప్పుడు), ఆయనకు అకస్మాత్తుగా ఒక “మెడికల్ ఎమర్జెన్సీ” (ఆరోగ్య సమస్య) తలెత్తింది. పోలీసుల ప్రకటన ప్రకారం.. ఆ వృద్ధుడు వాష్‌రూమ్ కోసం చాలా వెతికారు, కానీ సమయానికి అతనికి ఎక్కడా టాయిలెట్ కనిపించలేదు. పరిస్థితి పూర్తిగా తన నియంత్రణ దాటిపోవడంతో, విధిలేని పరిస్థితుల్లో ఆయన లిఫ్ట్ లోపల తన వద్ద ఉన్న ఒక వాటర్ బాటిల్‌లో మూత్ర విసర్జన చేయాల్సి వచ్చింది (అంతే తప్ప లిఫ్ట్ ఫ్లోర్‌పై చేయలేదు).


Posted

in

by

Tags: