అత్త అందగత్తె, మేనల్లుడు హ్యాండ్సమ్.. ఇద్దరూ గుడికి వెళ్ళారు, భర్తకు ఫోటో పంపారు.. కన్నీరు మున్నీరైన భర్త!

బాంకా: బీహార్‌లోని బాంకా జిల్లాలో ఒక మహిళ తన ఇల్లు, భర్త మరియు పిల్లలను వదిలేసి, తన మేనల్లుడితో కలిసి పారిపోయి గుడిలో పెళ్లి చేసుకుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఆమె తన వివాహం జరిగిన వెంటనే ఆ ఫోటోలను తన భర్తకు వాట్సాప్‌లో పంపి, అతన్ని విస్మయానికి గురిచేసింది.

ఏం జరిగింది?
అమర్‌పూర్ గ్రామానికి చెందిన శివం కుమార్‌కు పూనమ్ కుమారితో 2014లో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. కొన్ని సంవత్సరాల పాటు వారి సంసారం సజావుగానే సాగింది. అయితే, పూనమ్ దూరపు మేనల్లుడైన అంకిత్ కుమార్ వారి ఇంటికి రావడం మొదలుపెట్టిన తర్వాత పరిస్థితులు మారాయి. అంకిత్ తరచుగా ఇంటికి వస్తుండటంతో, పూనమ్ మరియు అంకిత్ మధ్య సాన్నిహిత్యం పెరిగింది.

ఇల్లు వదిలి.. మేనల్లుడితో వివాహం
ఒకరోజు పూనమ్ తన ఇద్దరు కుమారులను తీసుకుని అకస్మాత్తుగా అదృశ్యమైంది. భార్య ఎక్కడికి వెళ్లిందో తెలియక శివం కుమార్ ఆందోళన చెందాడు. బంధువులు, స్నేహితుల వద్ద వెతికినా ఎటువంటి ఆచూకీ దొరకలేదు. అయితే, సోమవారం రాత్రి శివం కుమార్ ఫోన్‌కు ఒక మెసేజ్ వచ్చింది. అందులో అంకిత్‌తో కలిసి గుడిలో పెళ్లి చేసుకున్న ఫోటోలు ఉన్నాయి. “నేను ఇప్పుడు అంకిత్‌ని వివాహం చేసుకున్నాను” అని ఆమె అందులో రాసింది. తన పిల్లల పరిస్థితి ఏంటోనని ఆందోళన చెందిన శివం కుమార్, వెంటనే అమర్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసి, తన పిల్లలను సురక్షితంగా రప్పించమని కోరాడు.

దర్యాప్తు కొనసాగుతోంది..
శివం కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, ఆ మహిళ మరియు పిల్లల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నట్లు అమర్‌పూర్ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ తెలిపారు.


Posted

in

by

Tags: