మీరు నిద్రపోతుంటారు.. కానీ ఇంట్లోని ఈ పరికరాలు రాత్రంతా కరెంటు బిల్లు పెంచేస్తుంటాయి! కళ్లు తెరిపించే నిజాలు ఇవే..

మీరు టీవీ, ఏసీ లేదా ఇతర విద్యుత్ పరికరాలను రిమోట్‌తో ఆపివేసి, కరెంటు ఆదా చేస్తున్నామని సంతోషిస్తున్నారా? అయితే, ఈ వార్త మీకోసమే. పైకి ఆరిపోయినట్లు కనిపించే అనేక పరికరాలు వాస్తవానికి 24 గంటలూ నిరంతరం విద్యుత్తును వాడుకుంటూనే ఉంటాయి.

ఈ తీవ్రమైన సమస్యపై విద్యుత్ శాఖ (Power Corporation) వినియోగదారులను అప్రమత్తం చేసింది. సోషల్ మీడియా వేదికగా వారు ప్రజలను హెచ్చరించడమే కాకుండా, పెరుగుతున్న కరెంటు బిల్లులను తగ్గించుకోవడానికి ఒక సులభమైన మార్గాన్ని కూడా సూచించారు.

విద్యుత్ శాఖ సలహా ఏంటి? చాలామంది గ్యాడ్జెట్లను ఉపయోగించిన తర్వాత కేవలం రిమోట్‌తో మాత్రమే ఆపివేస్తారు. ఇలా చేయడం వల్ల ఆ పరికరాలు ‘స్టాండ్‌బై మోడ్’ (Standby Mode)లోకి వెళ్తాయి. వినియోగదారులకు సౌకర్యవంతంగా ఉండాలని కంపెనీలు ఈ మోడ్‌ను ఇస్తాయి. కానీ దీనివల్ల స్క్రీన్ లేదా మెషిన్ ఆరిపోయినట్లు కనిపించినా, లోపలి సర్క్యూట్లు మాత్రం పనిచేస్తూనే ఉంటాయి. తద్వారా విద్యుత్ వినియోగం కొనసాగుతుంది. మెయిన్ స్విచ్‌ను పూర్తిగా ఆపివేయడం ద్వారా ఈ అనవసర విద్యుత్ వృథాను అరికట్టవచ్చు.

టీవీ, సెట్-టాప్ బాక్సుల విషయంలో జాగ్రత్త రిమోట్‌తో టీవీని ఆపినప్పుడు కేవలం స్క్రీన్ మాత్రమే ఆరిపోతుంది, టీవీ పూర్తిగా ఆగిపోదు. కాబట్టి టీవీని ఆపేటప్పుడు మెయిన్ బోర్డుపై ఉన్న పవర్ స్విచ్‌ను ఆపే అలవాటు చేసుకోవాలి. అలాగే, సెట్-టాప్ బాక్సులను కూడా గమనించాలి. ఇవి కూడా రాత్రంతా స్టాండ్‌బై మోడ్‌లో ఉండి భారీగా విద్యుత్తును తీసుకుంటాయి. కాబట్టి టీవీతో పాటు వీటిని కూడా పూర్తిగా ఆపివేయడం అవసరం.

ఛార్జర్లను ప్లగ్‌లోనే ఉంచకండి మొబైల్ లేదా ల్యాప్‌టాప్ ఛార్జింగ్ అయిపోయిన తర్వాత చాలామంది ఛార్జర్లను ప్లగ్‌లోనే ఉంచుతారు. పరికరం ఏదీ కనెక్ట్ చేయకపోయినా, సాకెట్‌లో ఉన్న ఛార్జర్ విద్యుత్తును వినియోగిస్తూనే ఉంటుంది. అవసరం లేనప్పుడు ఛార్జర్‌ను అన్‌ప్లగ్ చేయడమే ఉత్తమ మార్గం. ఇక ఏసీల విషయంలో కూడా చాలామంది కేవలం రిమోట్‌ను మాత్రమే వాడుతుంటారు. కానీ, ఏసీలోని ఇంటర్నల్ సర్క్యూట్రీ, సెన్సార్లు స్టాండ్‌బై మోడ్‌లో పనిచేస్తూనే ఉంటాయి. కాబట్టి, ఏసీ వాడిన తర్వాత మెయిన్ పవర్ స్విచ్‌ను ఆపివేయడం మర్చిపోవద్దు.


Posted

in

by

Tags: