బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ‘బోల్డ్’ నటిగా గుర్తింపు పొందిన జీనత్ అమన్ వృత్తిపరంగా ఎంతో విజయాన్ని సాధించారు. అయితే, ఆమె వ్యక్తిగత జీవితం మాత్రం అనేక సమస్యలతో నిండి ఉంది. ఆమె జీవితంలో ఐదుగురు ప్రముఖులతో అఫైర్లు ఉన్నట్లు ప్రచారం జరిగింది మరియు ఆమె రెండుసార్లు వివాహం చేసుకున్నారు.
జీనత్ అమన్ పేరు పలువురు ప్రముఖులతో ముడిపడి ఉంది. దేవ్ ఆనంద్‌తో ఆమె బంధం గురించి వార్తలు రాగా, పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌తో కూడా ఆమె సంబంధం కలిగి ఉన్నారని ఒకప్పుడు జోరుగా ప్రచారం జరిగింది. అయితే, వీటిని జీనత్ అమన్ ఎప్పుడూ ధృవీకరించలేదు.
మొదటి భర్త చేతిలో దౌర్జన్యం.. సంజయ్ ఖాన్‌తో ఉన్న బంధాన్ని జీనత్ అమన్ రహస్యంగా ఉంచడమే కాకుండా, వారిద్దరూ రహస్యంగా వివాహం కూడా చేసుకున్నారు. అప్పటికే సంజయ్ ఖాన్ వివాహితుడు. అయితే వారి బంధం ఏడాది కూడా కొనసాగలేదు. ఒక హోటల్ గదిలో సంజయ్ ఖాన్, తన మొదటి భార్య సమక్షంలోనే జీనత్ అమన్‌ను దారుణంగా కొట్టారని అప్పట్లో వార్తలు వచ్చాయి.
రెండో పెళ్లి తర్వాత అనుభవించిన వేదన.. సంజయ్ ఖాన్‌తో విడిపోయిన తర్వాత, జీనత్ అమన్ మజార్ ఖాన్‌ను వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు జన్మించారు. అయితే, మజార్‌ను పెళ్లి చేసుకోవడం తన జీవితంలో అతిపెద్ద తప్పు అని జీనత్ స్వయంగా పేర్కొన్నారు. ఇటీవల తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా రెండో వివాహంలో తాను ఎదుర్కొన్న ఇబ్బందులను ఆమె పంచుకున్నారు.
“నా జీవితం ఒక ఫోటో ఫ్రేమ్కే పరిమితమైపోయింది. కెరీర్ ఉన్నత స్థాయిలో ఉన్నప్పుడు పెళ్లి, మాతృత్వం వచ్చాయి. కానీ వైవాహిక జీవితంలో సమస్యలు మొదలయ్యాయి. అప్పట్లో నేను నా తల్లి వద్దకు వెళ్లిపోయాను. అప్పుడు నిర్మాత వివేక్ వాస్వాని నాకు కొత్త అవకాశం ఇచ్చారు..” అని ఆమె చెప్పుకొచ్చారు. జీనత్ అమన్ నేటికీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ, తన అభిమానులతో అనుబంధాన్ని కొనసాగిస్తున్నారు.
