ఉత్తరప్రదేశ్‌లోని బందా (Banda) ప్రాంతంలో అత్యంత దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. 8 నుంచి 16 ఏళ్ల లోపు వయసున్న 34 మంది చిన్నారులను తమ వలలో వేసుకుని, వారిపై అత్యాచారాలకు పాల్పడి, ఆ వీడియోలను పోర్న్ వెబ్‌సైట్‌లకు విక్రయించిన రాంబవన్, అతని భార్య దుర్గావతికి కోర్టు మరణశిక్ష విధిస్తూ సంచలన తీర్పు ఇచ్చింది. రాంబవన్ ఒక ప్రభుత్వ అసిస్టెంట్ ఇంజనీర్‌గా పనిచేసేవాడు.
దారుణం ఇలా జరిగింది: ఈ దంపతులు తమ పొరుగువారి పిల్లలు, దూరపు బంధువులు మరియు తమ పరిసరాల్లోని పేద పిల్లలనే లక్ష్యంగా చేసుకున్నారు. తాతయ్యల ఇంట్లో ఉంటూ చదువుకునే చిన్నారులను, పాలు పోయడానికి వచ్చిన వారిని నమ్మించి తమ ఇంట్లోకి పిలిచేవారు. ఇలా ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అన్నదమ్ములను కూడా ఈ దంపతులు బలిపశువులను చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది.
బాధితుల వేదన: “ల్యాప్‌టాప్ నేర్పిస్తామని, కంప్యూటర్ గేమ్స్ ఆడుకోవచ్చని చెప్పి మమ్మల్ని ఇంట్లోకి పిలిచేవారు. అక్కడ మా కళ్ల ముందే ఆ భార్యాభర్తలు అసభ్యంగా ప్రవర్తించేవారు. ఆ తర్వాత రాంబవన్ మమ్మల్ని అత్యాచారం చేసేవాడు. ఒక్కో బాలుడిపై కనీసం 10 నుండి 12 సార్లు లైంగిక దాడి జరిగేది. అతని భార్య దుర్గావతి కూడా మాపై అఘాయిత్యాలకు పాల్పడేది. మమ్మల్ని పరస్పరం అసభ్యకర పనుల్లో పాల్గొనమని ఒత్తిడి చేసి, ఆ దృశ్యాలను వీడియోలు తీసేవారు” అని బాధితులు కోర్టులో కన్నీరుమున్నీరుగా వాంగ్మూలం ఇచ్చారు.
బెదిరింపులు.. దారుణమైన వ్యాపారం: చిన్నారులకు గాయాలైనప్పుడు రాంబవన్ మందులు పూసేవాడు, దుర్గావతి వారికి మంచి భోజనం పెట్టి, రాంబవన్ కొంత డబ్బు ఇచ్చి ప్రలోభపెట్టేవారు. ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించడంతో ఆ చిన్నారులు భయంతో ఎవరికీ ఏమీ చెప్పుకోలేకపోయారు. రాంబవన్ తన ఇంటి యజమాని బిడ్డను, చివరికి తన స్వంత అక్క కుమారుడిని కూడా వదలకుండా లైంగిక వేధింపులకు గురిచేసినట్లు విచారణలో తేలింది. ఈ దంపతులు చిన్నారుల బలహీనతను ఆసరాగా చేసుకుని, తీసిన వీడియోలను విదేశీ వెబ్‌సైట్‌లకు అమ్మి సొమ్ము చేసుకునేవారు.
కోర్టు తీర్పు: ఈ కేసును విచారించిన ప్రత్యేక న్యాయస్థానం, చిన్నారులకు జరిగిన ఈ అన్యాయం అమానుషమని, క్షమించరానిదని పేర్కొంది. నిందితులు రాంబవన్ మరియు దుర్గావతికి మరణశిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది.
