ఇడ్లీ, దోస పిండిని ఫ్రిజ్‌లో ఎక్కువ రోజులు ఉంచుతున్నారా? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!

నేటి యాంత్రిక జీవనంలో ఇడ్లీ, దోస పిండిని వారం రోజుల పాటు ఫ్రిజ్‌లో ఉంచి వాడటం, దుకాణాల్లో దొరికే ప్యాకెట్ పిండిని కొనుగోలు చేయడం అలవాటుగా మారింది. అయితే, ఇది ఆరోగ్యానికి తీవ్రమైన ముప్పుగా మారుతోందని ఆహార నిపుణులు హెచ్చరిస్తున్నారు.

పిండిని నిల్వ ఉంచడం వల్ల కలిగే నష్టాలు:

  • పాత పిండి: ఇడ్లీ, దోస పిండి పులిసే స్వభావం కలిగి ఉంటాయి. పిండిని రుబ్బిన 24 గంటలలోపే వాడితే మంచిది. ఫ్రిజ్‌లో పెట్టినా, బ్యాక్టీరియా పెరుగుదలను పూర్తిగా అరికట్టలేం. 3 రోజులకు పైగా నిల్వ ఉన్న పిండిని తినడం వల్ల గుండెల్లో మంట, జీర్ణ సమస్యలు, తలనొప్పి, మరియు నిద్రలేమి వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
  • మెంతులు: పిండి రుబ్బేటప్పుడు వేసే మెంతులు 3 రోజుల తర్వాత విషతుల్యంగా మారి, శరీరంలో వాపులకు (Inflammation) కారణమవుతాయి. ఇది గుండె జబ్బులు ఉన్నవారికి చాలా ప్రమాదకరం.

ప్యాకెట్ పిండి (Packet Batter) ప్రమాదాలు:

  • రసాయనాలు: ప్యాకెట్ పిండి పాడవకుండా ఉండటానికి మరియు పొంగకుండా ఉండటానికి అందులో ‘బోరిక్ యాసిడ్’, ‘కాల్షియం సిలికేట్’ వంటి హానికరమైన రసాయనాలను కలుపుతారు. ఇవి కడుపు నొప్పి మరియు జీర్ణాశయ వ్యాధులకు కారణమవుతాయి.
  • నాణ్యత: కొన్ని రకాల పిండిలో ఉద్దిపప్పు (మినపప్పు)కు బదులుగా ఇతర వ్యర్థాలను కలుపుతున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి. అలాగే పిండిని రుబ్బే నీటి స్వచ్ఛత మరియు గ్రైండర్ శుభ్రత కూడా అనుమానాస్పదమే. దీనివల్ల ‘ఈ-కోలి’ (E.coli) వంటి బ్యాక్టీరియా వల్ల ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది.

ఆరోగ్యకరమైన చిట్కాలు:

  • తాజా పిండి: వీలైనంత వరకు ఇంట్లోనే తాజా పిండిని రుబ్బి వాడటం ఉత్తమం.
  • ముడి పదార్థాలు: తెల్ల మినపప్పుకు బదులుగా పొట్టుతో ఉన్న ‘నల్ల మినపప్పు’ వాడండి. ఇందులో ఉండే మంచి బ్యాక్టీరియా మరియు పీచు పదార్థం ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
  • చిరుధాన్యాలు: మధుమేహ వ్యాధిగ్రస్తులు బియ్యానికి బదులుగా సజ్జలు, రాగులు, కొర్రలు వంటి చిరుధాన్యాలను వాడవచ్చు.
  • ఇడ్లీతో సాంబార్: ఇడ్లీ తినేటప్పుడు పెసరపప్పు, సోంపు కలిపిన సాంబార్‌ను తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.

Posted

in

by

Tags: