ఫ్రాన్స్‌లో ఒక భయంకరమైన ఉదంతం వెలుగులోకి వచ్చింది. తన మాజీ భాగస్వామిని ఏడేళ్లపాటు చిత్రహింసలకు గురిచేసి, వందలాది మంది వ్యక్తులతో బలవంతంగా శృంగారం చేయించిన మాజీ బ్యాంక్ మేనేజర్ ‘గిల్లమ్ బుచ్చి’ (Guillaume Bucci)కి ఫ్రెంచ్ కోర్టు 25 ఏళ్ల జైలు శిక్ష విధించింది.
బాధితురాలు, 42 ఏళ్ల లాటిటియా ఆర్ (Laetitia R), గిల్లమ్ తనను ఏడేళ్లపాటు ఎలా హింసించాడో కోర్టుకు వివరించింది. అతను ఈ అకృత్యాలను ‘సాడోమాసోకిస్టిక్ గేమ్స్’ అని పిలిచి, తనను బెదిరిస్తూ ఈ పనులకు పురికొల్పేవాడని ఆమె చెప్పింది.
భయంకరమైన నిజాలు: 2015లో క్రిస్మస్ ఈవ్ రోజున, లాటిటియాను ఒక హైవే సర్వీస్ స్టేషన్‌కు వెళ్లి “అపరిచితులకు తనను తాను సమర్పించుకోమని” గిల్లమ్ ఫోన్లో ఆదేశించాడని, అతను ఫోన్లో వింటూనే తనను వేధింపులకు గురిచేశాడని ఆమె కన్నీటిపర్యంతమైంది. తన మాజీ ప్రియుడు గిల్లమ్, తనను వేశ్యగా మార్చి స్నేహితులు, సహోద్యోగులు మరియు అపరిచితులతో శృంగారం చేయించాడని, తాను 487 మంది దగ్గర ఆపేశానని, ఆ తర్వాత లెక్కపెట్టడం మానేశానని ఆమె కోర్టులో వాపోయింది.
గిజెల్ పెలికాట్ (Gisele Pelicot) కేసు నుండి ప్రేరణ పొందిన లాటిటియా, ఈ విచారణను బహిరంగంగానే జరపాలని కోరింది. అయితే, పెలికాట్ కేసులో భర్త తన భార్యకు మత్తుమందు ఇచ్చి అత్యాచారం చేయిస్తే, ఈ కేసులో గిల్లమ్ లాటిటియాను స్పృహలో ఉంచి, తన కళ్ల ముందే ఈ అకృత్యాలను చేయించాడని ప్రాసిక్యూటర్లు తెలిపారు.
నిరంతర భయం: 2015 నుండి 2022 వరకు తాను “నిరంతర భయంలో” గడిపానని, ఇది కేవలం అత్యాచారం మాత్రమే కాదు, ఇది ఒక “క్రూరమైన హింస” అని ఆమె ఆరోపించింది. తనను ఒక “బానిసలా” చూశాడని, తనతో మూత్రం తాగించడం వంటి నీచమైన పనులు చేయించాడని ఆమె కోర్టుకు చెప్పింది. వీరికి కూతురు పుట్టిన మరుసటి రోజే, ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యాక కూడా తనను ఒక ట్రక్ డ్రైవర్‌తో శృంగారంలో పాల్గొనమని బలవంతం చేశాడని ఆమె సాక్ష్యం ఇచ్చింది.
నిందితుడి వాదన: గిల్లమ్ బుచ్చి తాను గొంతు నులమడం, కాల్చడం వంటివి చేశానని అంగీకరించాడు, కానీ అవి “వారి మధ్య ఇష్టపూర్వకంగా జరిగిన లైంగిక క్రీడలే”నని వాదించాడు. ఆమెకు నొప్పి కలుగుతుందని తాను అనుకోలేదని బుకాయించాడు. అయితే, గిల్లమ్ పంపిన బెదిరింపు మెసేజ్‌లు మరియు వాయిస్ రికార్డింగ్‌లను ఆధారంగా చూపిస్తూ, ఆమె ప్రాణ భయంతోనే ఇవన్నీ చేసిందని ప్రాసిక్యూటర్లు నిరూపించారు.
చివరికి, కోర్టు గిల్లమ్ బుచ్చికి 25 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. శిక్షా కాలంలో కనీసం మూడింట రెండొంతుల సమయం జైలులోనే గడపాలని తీర్పునిచ్చింది.
