ప్రముఖ బ్రాండ్ పేరుతో మనం దుకాణాల్లో కొనే ఆహార పదార్థాలు మన పిల్లల ఆరోగ్యానికి ఎంతటి ప్రమాదకరంగా మారవచ్చో తెలియజేసే ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పిల్లలు ఎంతో ఇష్టంగా తాగే ‘ఫ్రూటీ’ (Frooti) 10 రూపాయల ప్యాకెట్‌ను ఒక మహిళ కట్ చేసి పాత్రలో పోయగా, మామిడి రసం రంగుకు బదులుగా, మురుగు నీరులాగా చిక్కని నలుపు రంగులో ద్రవం బయటకు రావడాన్ని చూసి ఆమె షాక్‌కు గురైంది. ప్రముఖ బ్రాండ్లను కళ్లు మూసుకుని నమ్మే మనం, మన పిల్లలకు ఎలాంటి ప్రమాదకరమైన పదార్థాలను కొనిస్తున్నామనే ప్రశ్నను ఈ వీడియో లేవనెత్తుతోంది.
“బ్రాండ్ అనే పేరుతో మనం కొనే వస్తువులు మన పిల్లల ప్రాణాలకే ప్రమాదకరం”, “మీ పిల్లలు కూడా ఈ విషాన్ని తాగుతున్నారా?” అంటూ నెటిజన్లు ఈ వీడియోను షేర్ చేస్తూ హెచ్చరిస్తున్నారు. ప్యాకెట్ జ్యూస్‌లు కొనేటప్పుడు తల్లిదండ్రులు ఎంతటి అప్రమత్తతతో ఉండాలో ఈ ఘటన స్పష్టం చేస్తోంది.
