కార్పొరేట్ ప్రపంచంలో: మెరుస్తున్న జీవనం, విదేశీ పర్యటనలు, లక్షల రూపాయల జీతం.. ఇది ఎంతో మంది కలల జీవితం. అశ్విని కుమార్ కూడా ఇదే జీవితాన్ని గడిపారు. అయితే, మానసిక ప్రశాంతత లేకపోవడంతో, తన 40వ ఏట ₹300 కోట్ల విలువైన సంస్థలో ఉన్న ‘వైస్ ప్రెసిడెంట్’ (VP) పదవికి అకస్మాత్తుగా రాజీనామా చేశారు.
అశ్విని కుమార్ తీసుకున్న ఈ నిర్ణయంతో ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర షాక్‌కు గురయ్యారు. ఆయన తల్లి మూడు రోజుల పాటు ఆయనతో మాట్లాడలేదు, తన భర్తకు పిచ్చి పట్టిందని ఆయన భార్య భావించింది. కుటుంబంలో ఇంత పెద్ద తుఫాను చెలరేగినా, ఆయన తన నిర్ణయానికే కట్టుబడి ఉన్నారు.
“ఇన్ని ఏళ్లుగా పగలు రాత్రి కష్టపడి మరొకరి బ్రాండ్‌ను పెంచుతున్నాను, మరి నాకంటూ ఏముంది?” అనే ఒకే ఒక్క ప్రశ్న తన రాజీనామాకు కారణమని అశ్విని కుమార్ ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. అర్ధరాత్రి ఆయన పోస్ట్ చేసిన ఈ వీడియో, తెల్లవారేసరికి 5 లక్షలకు పైగా వ్యూస్‌తో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ప్రస్తుతం ఆయన ‘BadaFranchise’ అనే సొంత స్టార్టప్ కంపెనీని ప్రారంభించి విజయవంతంగా నడుపుతున్నారు. కార్పొరేట్ ఏసీ క్యాబిన్లలో దొరకని ప్రశాంతత, ఇప్పుడు తన సొంత కష్టంలో దొరుకుతోందని ఆయన ఎంతో భావోద్వేగంతో తెలిపారు.
