అబద్ధం ఎన్నాళ్లూ దాగదు అంటారు. మన అబద్ధం ఎప్పుడో ఒకప్పుడు బయటపడుతుంది, కానీ ఎంత దారుణంగా బయటపడుతుందో ఈ వైరల్ వీడియో చూస్తే అర్థమవుతుంది.
అందిన సమాచారం ప్రకారం, ఒక యువకుడు తన గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి గోవా ట్రిప్‌కు వెళ్తుండగా, అదే విమానంలో అతని మరో ఇద్దరు గర్ల్‌ఫ్రెండ్స్ కూడా ప్రయాణిస్తుండటంతో అసలు విషయం బయటపడింది. ఆ యువకుడు ఏకకాలంలో ముగ్గురు అమ్మాయిలతో రహస్యంగా డేటింగ్ చేస్తున్నాడు. అయితే విమానంలో ముగ్గురి ముందు అతని బండారం బయటపడటంతో ఒక్కసారిగా రచ్చ మొదలైంది. ముగ్గురిని బుజ్జగించడానికి ఆ యువకుడు తలప్రాణం తోకకు వస్తుండగా, తోటి ప్రయాణికులు మాత్రం ఈ హై వోల్టేజ్ డ్రామాను బాగా ఎంజాయ్ చేశారు.
విమానంలో గందరగోళం: సోషల్ మీడియాలో షేర్ అయిన ఈ వీడియోలో విమానంలో గందరగోళం స్పష్టంగా కనిపిస్తోంది. యువకుడు మరియు ముగ్గురు ప్రేయసుల మధ్య పెద్ద గొడవ జరుగుతోంది. ఈ గొడవ శారీరక దాడి వరకు వెళ్లకపోయినా, వాగ్వాదం మాత్రం తారాస్థాయికి చేరింది. తోటి ప్రయాణికులు సీట్లలోనే కూర్చుని ఈ తతంగాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఎయిర్ హోస్టెస్ గొడవను సద్దుమణిగించేందుకు ప్రయత్నించినప్పటికీ, ఫలితం లేకుండా పోయింది. తమను మోసం చేశాడనే కోపంతో ఆ ముగ్గురు అమ్మాయిలు ఆ యువకుడిని ఏకిపారేశారు. అయితే, ఈ డ్రామా నిజమా లేక స్క్రిప్టెడ్ వీడియోనా అనేది ఇంకా స్పష్టత లేదు.
సోషల్ మీడియాలో నెటిజన్ల కామెంట్లు: ఈ వీడియోను @gambhirsin24472 అనే ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో షేర్ చేశారు. “గోవాకు బయలుదేరే ముందు విమానంలోనే రహస్యం బయటపడింది! ఒకరు కాదు, ముగ్గురు గర్ల్‌ఫ్రెండ్స్… విమానంలో గందరగోళం. చాలామందికి ఒక్క గర్ల్‌ఫ్రెండ్ కూడా లేదు, ఇతను మాత్రం ముగ్గురితో డేటింగ్ చేస్తున్నాడు” అని క్యాప్షన్‌లో రాశారు. దీనిపై నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు. “ఇది ఎయిర్‌లైన్స్ తప్పు, వాళ్లందరి టికెట్లు ఒకేసారి ఎందుకు బుక్ చేశారు?” అని ఒకరు, “ఇది స్క్రిప్టెడ్ వీడియోలా ఉంది” అని మరొకరు కామెంట్ చేశారు. “అందుకే అతి ఆశ కూడదు” అని మరో నెటిజన్ ఎద్దేవా చేశారు.
