సబ్-ఇన్‌స్పెక్టర్ భార్యను మామకు అప్పగించి.. ఆపై బలవంతంగా అత్యాచారం! భర్త అరాచకంపై పోలీసు అధికారిణి సంచలన ఫిర్యాదు

ప్రయాగ్‌రాజ్: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ఒక మహిళా సబ్-ఇన్‌స్పెక్టర్ తన అత్తమామల ఇంటిపై చేసిన ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. తనపై మామ అత్యాచారం చేశాడని, భర్త తనను చిత్రహింసలకు గురిచేశాడని ఆ మహిళా అధికారిణి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అసలేం జరిగింది? లక్నోకు చెందిన ఈ మహిళా ఎస్సై, ప్రయాగ్‌రాజ్‌లో విధులు నిర్వర్తిస్తున్నారు. ఫిబ్రవరి 14, 2025న ఆమె శుభమ్ సింగ్‌ను ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇది అంతర్జాతి వివాహం కావడంతో, పెళ్లయినప్పటి నుండి అత్తమామలు ఆమెను కులంపేరుతో దూషిస్తూ వేధించేవారని, ఉద్యోగం మానేయాలని ఒత్తిడి చేసేవారని బాధితురాలు పేర్కొంది. తాము చెప్పినట్టు వినకపోవడంతో, వారు ఆమెను తుపాకీతో భయపెట్టారని, ఆ సమయంలో మామ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడని ఆమె ఆరోపించింది.

భర్త అరాచకాలు: మామ చేసిన పనిని తన భర్తకు చెబితే, అతను స్పందించకపోగా తననే మౌనంగా ఉండమని హెచ్చరించాడని బాధితురాలు తెలిపింది. భర్త కూడా తన ఇష్టానికి వ్యతిరేకంగా బలవంతంగా శారీరక సంబంధం పెట్టుకునేవాడని, దానికి అడ్డుపడితే చంపేస్తానని బెదిరిస్తూ ఎలుకల మందు (పాయిజన్) తినిపించి గదిలో బంధించాడని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. విషయం తెలుసుకున్న ఆమె తండ్రి అక్కడికి చేరుకుని, కుమార్తెను చికిత్స కోసం సివిల్ ఆసుపత్రికి తరలించారు.

తండ్రిపై కూడా దాడి: కుమార్తెకు జరిగిన అన్యాయంపై నిలదీయడానికి వెళ్లిన తండ్రిపై కూడా అత్తమామల కుటుంబ సభ్యులు దాడి చేశారు. భర్త తనపై తుపాకీతో కాల్పులు జరిపినా, తృటిలో తప్పించుకున్నానని బాధితురాలు తెలిపింది. ఎస్సై అయి ఉండి కూడా తన ఫిర్యాదును పోలీసులు నమోదు చేయడం లేదని ఆమె ఆరోపించింది.

పోలీసుల దర్యాప్తు: కాకోరి ఏసీపీ షకీల్ అహ్మద్ స్పందిస్తూ, బాధితురాలి నుండి ఫిర్యాదు అందిందని, దీనిపై లోతైన దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. విచారణలో వెల్లడయ్యే నిజాల ఆధారంగా నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.


Posted

in

by

Tags: