సెక్రటరీతో భర్త రాసలీలలు.. భార్యను చూసి కంగారుపడాల్సింది పోయి, ఆమెనే క్షమాపణ అడిగింది! ఆ తర్వాత ఏం జరిగిందంటే?

భార్యాభర్తల బంధం నమ్మకంపై ఆధారపడి ఉంటుంది. ఒకరు నమ్మకద్రోహం చేస్తే ఆ బంధం కూలిపోవడం ఖాయం. సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో విడాకులు తీసుకోవడం సర్వసాధారణం. కానీ, తన భర్తను తన సెక్రటరీతో అభ్యంతరకర స్థితిలో పట్టుకున్న ఒక భార్య, అందరూ ఊహించిన దానికి భిన్నంగా స్పందించింది. ఆమె చేసిన పని భర్తను మాత్రమే కాదు, అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

ఏం జరిగింది? ఈ ఘటన యునైటెడ్ కింగ్‌డమ్‌లో చోటుచేసుకుంది. 40 ఏళ్ల వయసున్న ఆ భార్యాభర్తలు పాఠశాల రోజుల్లోనే ప్రేమించుకుని వివాహం చేసుకున్నారు. కొన్నాళ్ల క్రితం భర్త ఆఫీసులో 24 ఏళ్ల యువతి సెక్రటరీగా చేరింది. క్రమంగా వారిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగి, ఆఫీసులోనే అక్రమ సంబంధం పెట్టుకున్నారు. భర్త సెక్రటరీతో గడపడానికి ఆఫీసులో ఆలస్యంగా ఉండటం మొదలుపెట్టాడు.

భార్యకు దొరికిపోయిన భర్త: ఒకరోజు భార్య తన భర్తకు సర్ప్రైజ్ ఇద్దామని, చెప్పాపెట్టకుండా ఆఫీసులోకి వచ్చింది. ఆమె తన భర్త క్యాబిన్‌లోకి ప్రవేశించగా, అక్కడ భర్త తన సెక్రటరీతో అభ్యంతరకర స్థితిలో కనిపించాడు. తన భార్యను అకస్మాత్తుగా అక్కడ చూసిన భర్తకు ఏం చేయాలో పాలుపోలేదు. తాను చేస్తున్న పనికి భార్య ముందు పరువు పోయిందని, ఆమె తనపై విరుచుకుపడుతుందని భయపడ్డాడు. ఆ తర్వాత భార్య అక్కడి నుండి తన సోదరి ఇంటికి వెళ్ళిపోయింది.

భార్య చేసిన పనికి భర్త షాక్: భార్య తనపై కోపంతో ఊగిపోతుందని, విడాకులు అడుగుతుందని భర్త అనుకున్నాడు. కానీ కొన్ని రోజుల తర్వాత భార్య నుండి ఒక మెసేజ్ వచ్చింది. అందులో ఆమె ఇలా రాసింది: “నన్ను క్షమించు, నీకు కావాల్సిన సుఖాన్ని నేను ఇవ్వలేకపోయానేమో అందుకే నువ్వు అలా చేశావు.”

తన భార్య పంపిన మెసేజ్ చూసి భర్త కన్నీళ్లు పెట్టుకున్నాడు. తప్పు తనది కాగా, తననే నిందించే బదులు భార్య క్షమాపణ కోరడం అతడిని కలిచివేసింది. ఆ తర్వాత భార్య ఇంటికి తిరిగి రాగా, ఇప్పుడు వారిద్దరూ సంతోషంగా జీవిస్తున్నారు. తన భార్య తనను ఇప్పుడు మునుపటి కంటే ఎక్కువగా ప్రేమిస్తోందని, ఆ ఘటన తర్వాత వారి బంధం మరింత బలపడిందని ఆ వ్యక్తి చెప్పుకొచ్చాడు.


Posted

in

by

Tags: