ముంబై: మాయా నగరి ముంబై ఎందరికో కలలను ఇస్తుంది, కానీ ఒక్కోసారి ఆ కలే పీడకలగా మారుతుంది. ఇక్కడ ఒక్కోసారి స్టార్డమ్ ఆకాశాన్ని తాకితే, మరికొన్ని సందర్భాల్లో జీవితం అధఃపాతాళానికి పడిపోతుంది. భోజ్‌పురి చిత్ర పరిశ్రమలో ఒకప్పుడు మెరిసిన నటి మిశ్రమావస్థ చూస్తుంటే ఇదే నిజమనిపిస్తుంది.
ఎవరీ నటి? మనం మాట్లాడుకుంటున్నది పూర్వపు భోజ్‌పురి నటి మిశాలీ శర్మ (Mitali Sharma) గురించి. ఆమె పలు భోజ్‌పురి చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. మోడలింగ్ రంగంలోనూ రాణించారు. హిందీ సినిమాల్లో అవకాశాల కోసం ఆమె ఢిల్లీ నుంచి ముంబైకి మకాం మార్చారు. ఆ క్రమంలో ఆమె తన కుటుంబానికి దూరమై, ఆర్థికంగానే కాకుండా మానసికంగా కూడా ఒంటరిగా మిగిలిపోయారు.
అసఫలత తెచ్చిన దుస్థితి: ముంబైలో తొలినాళ్లలో కొన్ని ప్రాజెక్టులు దక్కినా, ఆ తర్వాత అవకాశాలు తగ్గిపోయాయి. సరైన ఆదాయం లేకపోవడం, వరుస వైఫల్యాలు మరియు మానసిక ఒత్తిడి ఆమె జీవితాన్ని ఛిద్రం చేశాయి. ముంబైలోని లోఖండ్వాలా వీధుల్లో ఆమె దయనీయ స్థితిలో కనిపించడం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. ఒకప్పటి హీరోయిన్ రోడ్డుపై బిక్షాటన చేస్తూ కనిపించడంతో స్థానికులు షాక్ అయ్యారు.
పోలీసుల జోక్యం: రోడ్డుపై ఆమె అల్లరి చేస్తున్నారన్న ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. అదుపులోకి తీసుకునే సమయంలో, ఆమె పోలీసులపై దాడి చేయడానికి ప్రయత్నించినట్లు సమాచారం. పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లాక ఆమె ఆకలితో ఉన్నట్లు గుర్తించి, ఆహారం అందించారు. ఆమె మానసిక మరియు శారీరక పరిస్థితిని గమనించిన అధికారులు, వెంటనే ఆమెకు చికిత్స అందించేందుకు ఆసుపత్రికి తరలించారు.
ఒకప్పుడు కెమెరాల ముందు గ్లామర్‌తో మెరిసిన నటి, ఇప్పుడు ఇలాంటి పరిస్థితిలో ఉండటం చూసి సినీ అభిమానులు కలత చెందుతున్నారు. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని సమాచారం.
