రాత్రంతా అరిచిన గేదె; ఉదయం బయటపడిన నిజం చూసి షాక్‌కు గురైన ఊరు!

కొన్నిసార్లు నమ్మశక్యం కాని సంఘటనలు జరుగుతుంటాయి. అవి అద్భుతాల కంటే తక్కువగా అనిపించవు. అలాంటి ఒక సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ జిల్లాలో చోటుచేసుకుంది.

ఇక్కడ ఒక రైతుకు చెందిన గర్భిణీ బర్రె రాత్రంతా బాధతో అరుస్తూనే ఉంది. ఉదయం గ్రామస్తులంతా అక్కడికి చేరుకోగా, వారు చూసిన దృశ్యం అందరినీ ఆశ్చర్యపరిచింది.

ఈ ఘటన మీరట్‌లోని మహల్కా గ్రామంలో జరిగింది. స్థానిక రైతు నుమాన్ ఖురేషీకి చెందిన బర్రె గర్భిణీగా ఉంది. అర్ధరాత్రి ఆకస్మికంగా అది బాధతో అరుస్తుండటంతో గ్రామస్తులంతా అక్కడికి చేరుకున్నారు. సాధారణంగా గర్భిణీ బర్రెల కంటే దీని పొట్ట చాలా పెద్దదిగా ఉండటంతో, అది రెండు దూడలకు జన్మనిస్తుందని అందరూ భావించారు. కానీ, ప్రసవం జరిగిన తర్వాత అందరూ షాక్‌కు గురయ్యారు. ఆ బర్రె ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా మూడు దూడలకు జన్మనిచ్చింది. ఈ అద్భుత ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.


Posted

in

by

Tags: