ఒడిశా రాష్ట్రంలో పక్షవాతంతో బాధపడుతున్న కృష్ణచంద్ర అనే వృద్ధుడికి ఎదురైన ఈ దారుణ ఘటన దేశవ్యాప్తంగా అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది.
ఆయన ఇంట్లో కుర్చీలో కూర్చుని ఉండగా, అక్కడికి వచ్చిన ఒక భారీ పాము వృద్ధుడి రెండు చేతులను కుర్చీతో కలిపి గట్టిగా చుట్టేసింది. పక్షవాతం వల్ల శరీరాన్ని కదిలించలేక, గట్టిగా అరిచి ఇతరులను పిలవలేక, ఆ వృద్ధుడు ఏం చేయాలో తెలియక పాము మృత్యుపాశంలో చిక్కుకుపోయారు.
దాదాపు 4 గంటలకు పైగా ఆ విషసర్పం వృద్ధుడి చేతులను వదలకుండా బిగించి ఉంచడంతో, ఆయన తీవ్రమైన నరకాన్ని అనుభవించారు. 4 గంటల సుదీర్ఘ పోరాటం తర్వాత, ఎవరూ ఊహించని విధంగా ఆ పాము తనంతట తానుగానే పట్టు సడలించి అక్కడి నుండి వెళ్లిపోవడంతో, ఆ వృద్ధుడు తృటిలో ప్రాణాపాయం నుండి తప్పించుకున్నారు. చూసేవారి వెన్నులో వణుకు పుట్టించే ఈ దారుణ ఘటన ఇప్పుడు నెట్టింట తీవ్ర చర్చనీయాంశమైంది.
