సాధారణంగా ఒకరు ఒకటి లేదా రెండు పెళ్లిళ్లు చేసుకోవడం మనం వింటూనే ఉంటాం. కొందరు రెండో పెళ్లి చేసుకుంటే, మొదటి భార్యను వదిలేసి మరో స్త్రీని భార్యగా అంగీకరిస్తారు. కానీ, ఈరోజు మనం చెప్పుకోబోయే వ్యక్తి కథ చాలా విచిత్రమైనది. ఈయన ఒకరిద్దరు కాదు, ఏకంగా ఐదు వివాహాలు చేసుకున్నాడు. వీరికి మొత్తం పదిమంది పిల్లలు. వీరంతా ఒకే ఇంటి పైకప్పు కింద కలిసి జీవిస్తున్నారు. ఐదుగురు భార్యలతో ఈ వ్యక్తి ఎలా సమయం గడుపుతున్నాడనేది అందరిలోనూ ఆసక్తిని కలిగిస్తోంది.
‘ద సన్’ వెబ్సైట్ నివేదిక ప్రకారం, ఈ ‘బారెట్ ఫ్యామిలీ’ సోషల్ మీడియాలో నిత్యం చర్చనీయాంశమవుతోంది. ఈ కుటుంబంలో ఒక భర్త, ఐదుగురు భార్యలు ఉన్నారు. భార్యలందరికీ ఒకే భర్త ఉన్నారు తప్ప, వారి మధ్య ఎలాంటి సంబంధాలు లేవు. వారు తమను తాము ‘సిస్టర్ వైఫ్స్’ (Sister Wives) అని పిలుచుకుంటారు. వీరికి పదిమంది పిల్లలు కూడా ఉన్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఒకే భర్త ఉన్నప్పటికీ భార్యల మధ్య ఎలాంటి అసూయ లేదు. వారు తరచుగా సోషల్ మీడియాలో తమ భర్తతో ఉన్న వీడియోలను పోస్ట్ చేస్తుంటారు.
ఈ కుటుంబం టిక్‌టాక్ (TikTok) ప్లాట్ఫామ్లో ఒక వీడియోను పోస్ట్ చేసింది. అందులో, ఆ వ్యక్తికి ఐదుగురు భార్యలు ఉన్నారని వెల్లడించారు. భార్యల వాదన ప్రకారం, తమ జీవితంలో మరొక పురుషుడు అవసరం లేదని, తమకు ఒకే భర్త ఉండటం పట్ల తాము సంతోషంగా ఉన్నామని చెబుతున్నారు. భర్తకు ఇంతమంది భార్యలు ఉండటం వల్ల, ఆయన ఎప్పటికీ వేరే మహిళల ప్రేమలో పడే అవకాశం లేదని వారు నమ్ముతున్నారు.
