భారతీయ క్రికెట్ ఆర్థిక రంగాన్నే పూర్తిగా మార్చేసి, వేల కోట్ల విలువైన ఐపీఎల్ (IPL) లీగ్‌ను సృష్టించిన లలిత్ మోదీ, తాను క్రికెట్ వ్యాపారం నుండి శాశ్వతంగా ఎందుకు తప్పుకోవాల్సి వచ్చిందో తాజాగా కొన్ని షాకింగ్ విషయాలను బయటపెట్టారు. ముంబై అండర్వర్ల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం మరియు అతని ‘డీ-కంపెనీ’ నుండి వచ్చిన వరుస హత్య బెదిరింపులే తన నిర్ణయానికి ప్రధాన కారణమని ఆయన పేర్కొన్నారు.
అసలేం జరిగింది? 2008లో ఐపీఎల్‌ను ప్రారంభించిన లలిత్ మోదీ, 2010లో ఆర్థిక అవకతవకల ఆరోపణల నేపథ్యంలో లండన్‌కు వెళ్ళిపోయారు. ఇటీవల ‘ఏఎన్ఐ’ (ANI) వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో, 2012లో లండన్‌లో జరిగిన ఒక భయానక ఘటనను ఆయన వివరించారు.
అర్ధరాత్రి 3:30 గంటలకు లండన్‌కు చెందిన ఒక బెట్టింగ్ బుకీ, లలిత్ మోదీని “బాబా” అనే మధ్యవర్తి నివసించే పెెంట్హౌస్ అపార్ట్‌మెంట్‌కు రావాలని ఒత్తిడి చేశాడు. అక్కడికి వెళ్లగానే, ఆ వ్యక్తి శాటిలైట్ ఫోన్ ద్వారా నేరుగా దావూద్ ఇబ్రహీంకు కాల్ చేసి స్పీకర్లో పెట్టాడు. ఆ క్షణం గురించి లలిత్ మోదీ మాట్లాడుతూ, “ఆ సమయంలో నాకు చాలా భయం వేసింది. భయంతో నా ప్యాంట్‌లోనే మూత్రం పోసుకున్నాను. ఇది చెప్పడానికి నాకు ఎలాంటి మొహమాటం లేదు. అప్పుడు బ్రిటీష్ ఎంఐ5 (MI5) భద్రతా అధికారులు కిందనే ఉన్నారు. ఫోన్లో దావూద్, ‘ఇక నీ కథ ముగిసింది’ అని చెప్పి కాల్ కట్ చేశాడు” అని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎలా మొదలైంది? ఈ బెదిరింపులు 2009లోనే, అంటే ఐపీఎల్ రెండో సీజన్ సమయంలోనే మొదలయ్యాయని మోదీ తెలిపారు. అప్పట్లో లోక్‌సభ ఎన్నికల కారణంగా లలిత్ మోదీ ఐపీఎల్‌ను దక్షిణాఫ్రికాకు తరలించారు. ఈ మార్పు వల్ల ఇండియాలో అక్రమంగా సాగే వేల కోట్ల బెట్టింగ్ మార్కెట్ కుప్పకూలింది. దీంతో నష్టపోయిన బుకీలు ఆ నష్టాన్ని తననే భరించమని బెదిరించారని, తను లంచాలు తీసుకోవడానికి మరియు స్పాట్ ఫిక్సింగ్‌ను అడ్డుకోవడానికి నిరాకరించినందునే తనపై హత్యాయత్నాలు జరిగాయని మోదీ వెల్లడించారు.
చివరి ఆప్షన్: దావూద్ హిట్ లిస్ట్ నుండి బయటపడటానికి తనకి ఉన్న ఒకే ఒక్క ఆప్షన్, క్రికెట్ నుండి తప్పుకోవడమని మోదీ చెప్పారు. “నేను వాళ్లతో ఎలాంటి సమస్యను పరిష్కరించుకోలేదు. క్రికెట్ నుండి రిటైర్ అవుతానని వాళ్లకు మాట ఇచ్చాను, అలాగే తప్పుకున్నాను” అని ఆయన పేర్కొన్నారు.
నేపథ్యం: 2008 నుండి 2010 వరకు ఐపీఎల్ చైర్మన్‌గా వ్యవహరించి, క్రికెట్ మరియు బాలీవుడ్ గ్లామర్‌ను కలిపి ప్రపంచ క్రికెట్ ముఖచిత్రాన్ని మార్చిన వ్యక్తి లలిత్ మోదీ. అయితే, ఆర్థిక అవకతవకల ఆరోపణలతో బీసీసీఐ ఆయనపై జీవితకాల నిషేధం విధించడం తెలిసిందే.
