కొన్ని కథలు వింటుంటే గుండె తరుక్కుపోతుంది. సొంతవారే నమ్మకద్రోహం చేస్తే పడే వేదన వర్ణనాతీతం. ‘
ఎవరీ అల్కా జైస్వాల్? అల్కా ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన యువతి. చిన్నతనంలోనే టీబీ వంటి ప్రాణాంతక వ్యాధితో పోరాడి, చదువు పూర్తి చేసింది. ఎంతో ఆశతో పెళ్లి చేసుకున్న అల్కా జీవితం, వివాహం తర్వాత ఒక్కసారిగా కుప్పకూలిపోయింది.
పెళ్లి పేరుతో మోసం: అల్కాకు మర్చంట్ నేవీలో అధికారి అని చెప్పి ఒక వ్యక్తితో పెళ్లి చేశారు. తీరా అత్తవారింటికి వెళ్ళాక తెలిసింది ఏంటంటే, ఆ వ్యక్తికి ఉద్యోగం లేదు, అతని సర్టిఫికెట్లు అన్నీ నకిలీవి, పైగా అతను వయసులో కూడా చాలా పెద్దవాడు. అల్కా వెళ్ళిన ఇల్లు కూడా సొంతది కాదని తేలింది.
గర్భవతిగా ఉన్నప్పుడు నరకం: అల్కా ఎనిమిది నెలల గర్భవతిగా ఉన్నప్పుడు, అత్తవారింట్లో ఆమెపై శారీరక దాడులు జరిగాయి. భర్త ఏ పని చేయకుండా, దుర్వాసనలతో గడిపేవాడు. ఆ సమయంలో ఆస్పత్రి ఖర్చులకు కూడా డబ్బులు లేక అల్కా ఎంతో అవస్థ పడింది. అల్కాకు ప్రీ-మెచ్యూర్ డెలివరీ జరిగినప్పుడు కూడా, భర్త ఆమెను ఆస్పత్రిలో వదిలేసి పారిపోయాడు. అల్కా తల్లిదండ్రులు బిల్లులు కట్టి ఆమెను కాపాడుకున్నారు.
చేతిలో 5 రూపాయలు, నైటీతో రోడ్డుపై.. తన జీవితంలోని అత్యంత దారుణమైన రోజును గుర్తుచేసుకుంటూ అల్కా కన్నీటిపర్యంతమయ్యారు. ఎనిమిది నెలల గర్భంతో ఉన్నప్పుడు, నైటీ ధరించి, చేతిలో కేవలం 5 రూపాయల నాణెం పట్టుకుని రోడ్డున పడ్డారు. ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచనలు కూడా వచ్చాయని, కానీ తన బిడ్డ కోసం ఆ ఆలోచనను విరమించుకున్నానని ఆమె పేర్కొన్నారు.
అల్కా గెలుపు: ఆ కష్టాల నుంచి బయటపడి, జీవితంతో పోరాడిన అల్కా నేడు ఒక సక్సెస్‌ఫుల్ బ్యాంకర్. యూట్యూబ్, సోషల్ మీడియాలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ‘మిస్ గోరఖ్‌పూర్’ వంటి టైటిళ్లను గెలుచుకున్నారు. ప్రస్తుతం ఆమె మరో వివాహం చేసుకుని, తన సక్సెస్‌కు తన రెండో భర్త మద్దతునే ప్రధాన కారణమని చెబుతూ, ఆనందంగా జీవిస్తున్నారు.
