బీహార్ రాష్ట్రం రోహివా గ్రామానికి చెందిన జగ్లాల్ మహతో చిన్న కుమార్తె మమతా కుమారి. ఆమెకు నలుగురు అక్కలు ఉన్నారు. వారందరికీ వివాహమై వారి వారి కుటుంబాలతో నివసిస్తున్నారు.
వారిలో పెద్దక్క కుమారుడైన గోలు అనే యువకుడు చిన్నప్పటి నుండి తరచూ తన తాతగారి ఇంటికి వస్తూ ఉండేవాడు. ఆ సమయంలో తన చిన్నమ్మ అయిన మమతా కుమారికి, గోలుకు మధ్య ఉన్న చిన్నమ్మ-కొడుకు అనే వరసను దాటి ప్రేమ (అక్రమ సంబంధం) ఏర్పడింది.
చూడకూడని దృశ్యం చూడటంతో ఆగ్రహం
వీరిద్దరూ వరుసకు బంధువులు కావడంతో, వీరి ప్రవర్తనపై ఎవరికీ ఎలాంటి అనుమానం రాలేదు. అలా సన్నిహితంగా ఉంటూ వచ్చిన వీరిద్దరూ, కాలక్రమేణా తరచూ ఏకాంతంగా గడపడం అలవాటు చేసుకున్నారు. పండుగ సమయాల్లో కుటుంబ సభ్యులంతా కలిసి రోహివా ప్రాంతంలోని ఇంట్లో వేడుకలు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. అలాగే గత వారం కూడా అందరూ ఒకచోట చేరారు.
ఆ సమయంలో గోలు కూడా తన తల్లితో కలిసి అక్కడికి వెళ్లాడు. ఎవరికీ తెలియకుండా మమతతో కలిసి తరచూ బయటకు వెళ్లి వస్తూ ఉండేవాడు. అంతేకాకుండా రాత్రి వేళల్లో కూడా వీరిద్దరూ ఏకాంతంగా గడుపుతున్నట్లు తెలిసింది. ఇలా ఉండగా, ఒకరోజు రాత్రి ఊహించని విధంగా మమతా కుమారి తండ్రి మందుల కోసం ఆమె గదిలోకి వెళ్లాడు. అక్కడ మమత, గోలు ఇద్దరినీ చూడకూడని స్థితిలో చూసి ఆయన తీవ్ర ఆగ్రహానికి లోనయ్యాడు. అనంతరం వారిద్దరినీ కొట్టి గట్టిగా కేకలు వేయడంతో బంధువులు, చుట్టుపక్కల వారు అక్కడకు చేరుకున్నారు.
దీనిని బట్టి గ్రామంలో పంచాయతీ నిర్వహించారు. బంధువులంతా కలిసి మమత, గోలులను సమీపంలోని గుడికి తీసుకెళ్లి అక్కడ వారికి వివాహం జరిపించారు. అంతేకాకుండా, దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో కూడా షేర్ చేశారు. తల్లి సొంత చెల్లెలితో, కొడుకు శారీరక సంబంధం పెట్టుకున్న ఈ ఘటన స్థానిక ప్రజల్లో తీవ్ర కలకలం రేపింది.
