దిండిగల్ జిల్లా వత్తలగుండు సమీపంలోని ఒక ప్రైవేట్ కళాశాల హాస్టల్ విద్యార్థినులకు అసభ్యకరమైన మెసేజ్‌లు పంపిన వార్డెన్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.
బాధితులైన విద్యార్థినులు ఈ విషయంపై కళాశాల కరస్పాండెంట్మ రియు అధ్యాపకులకు ఫిర్యాదు చేశారు. అయితే, వారు వార్డెన్‌పై చర్యలు తీసుకోవడానికి బదులుగా, ఫిర్యాదు చేసిన విద్యార్థినులను కులం పేరుతో దూషించి అవమానించినట్లు షాకింగ్ ఆరోపణలు వెలువడ్డాయి.
దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు దిండిగల్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో అధికారికంగా ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా ముమ్మర విచారణ జరిపిన పోలీసులు.. కులం పేరుతో దూషించి, వేధించిన నేరానికి గాను కళాశాల కరస్పాండెంట్ సెల్వకుమార్ సహా ఆరుగురిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
