బిహార్‌లోని సారణ్ జిల్లా మష్రక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సేమ్రీ గ్రామానికి చెందిన కరణ్ బాన్స్‌ఫోడ్ అనే వ్యక్తికి సంబంధించిన ఒక వింత ఉదంతం వెలుగుచూసింది. అతను ఎవరికీ తెలియకుండా మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడని, 8 మంది పిల్లలకు తండ్రి అయ్యాడని ఆరోపణలు వచ్చాయి. అయితే ట్విస్ట్ ఏంటంటే.. అతనికి అప్పటికే పెళ్లయిన సంగతి ఆ ముగ్గురు భార్యలలో ఎవరికీ తెలియదు.
ఈ సీక్రెట్ కాస్తా బయటపడటంతో ముగ్గురు భార్యలు ఒకేసారి పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. దాంతో ఈ విషయం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ ఆరోపణలపై పోలీసులు ప్రస్తుతం విచారణ జరుపుతున్నారు.
కథ ఎలా మొదలైందంటే: ఆరోపణల ప్రకారం.. 2021లో కరణ్ బాన్స్‌ఫోడ్‌కు రాణీ దేవితో మొదటి వివాహం జరిగింది. రాణీ దేవి ద్వారా అతనికి ముగ్గురు కుమారులు ఉన్నారు. మొదట రాణీ దేవిని పెళ్లాడిన కరణ్, ఆ తర్వాత సోషల్ మీడియా ద్వారా పరిచయమైన సివాన్‌కు చెందిన రేఖా దేవి అనే వితంతువును రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత రేఖా దేవి సొంత చెల్లెలు సీతా కుమారిని కూడా మూడో వివాహం చేసుకున్నట్లు సమాచారం. ఇప్పుడు తన పిల్లల భవిష్యత్తు ఏంటని మొదటి భార్య రాణి ఆందోళన వ్యక్తం చేస్తోంది.
రెండో భార్య సొంత చెల్లెలితో మూడో పెళ్లి: మొదటి పెళ్లి తర్వాత కరణ్‌కు సోషల్ మీడియాలో సివాన్‌కు చెందిన వితంతువు రేఖా దేవితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారి, కరణ్ ఆమెను రెండో పెళ్లి చేసుకున్నాడు. ఈ బంధం ద్వారా వారికి ఒక కుమారుడు జన్మించాడు. అయితే కథలో అసలైన ట్విస్ట్ ఎప్పుడు వచ్చిందంటే.. కరణ్ తన రెండో భార్య రేఖా దేవి సొంత చెల్లెలు సీతా కుమారిని కూడా ఒక గుడిలో మూడో పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయం బయటపడటంతో ముగ్గురు మహిళల మధ్య పెద్ద గొడవ జరిగి, వ్యవహారం కాస్తా పోలీస్ స్టేషన్‌కు చేరింది.
తమ పెళ్లే చెల్లుతుందని ముగ్గురి వాదన: మొదటి భార్య రాణీ దేవి తాను ఇన్నేళ్లుగా భార్యగా ఉంటున్నానని, సమాజంలో తన గౌరవం, పిల్లల భవిష్యత్తు ప్రమాదంలో పడ్డాయని అంటోంది. రెండో భార్య రేఖా దేవి కూడా తన పెళ్లే చెల్లుతుందని, భర్తగా తన బాధ్యతలను నెరవేర్చాలని ఒత్తిడి చేస్తోంది. ఇక మూడో భార్యగా చెబుతున్న సీతా కుమారి కూడా తనకు న్యాయం జరగాలని, హక్కులు కావాలని డిమాండ్ చేస్తోంది.
8 మంది పిల్లల భవిష్యత్తుపై ఆందోళన: ఈ మొత్తం వివాదంలో పిల్లల భవిష్యత్తు పెద్ద ప్రశ్నార్థకంగా మారింది. మొదటి భార్యకు 3 గురు పిల్లలు, రెండో భార్యకు మొదటి పెళ్లి ద్వారా కలిగిన 4 గురు పిల్లలు, మరియు కరణ్-రేఖలకు పుట్టిన ఒకరు.. ఇలా మొత్తం 8 మంది పిల్లల జీవితాలు ఇప్పుడు అయోమయంలో పడ్డాయి. వీరి పోషణ, హక్కుల బాధ్యత ఎవరు తీసుకుంటారనేది ఆందోళన కలిగిస్తోంది.
పోలీసుల దర్యాప్తు: బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ముగ్గురు భార్యలను, నిందితుడిని విచారిస్తున్నారు. వారి వివాహ ధృవీకరణ పత్రాలను పరిశీలిస్తున్నారు. విచారణ పూర్తయిన తర్వాతే చట్టపరంగా ఎవరి వాదన చెల్లుతుంది, ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనేది స్పష్టమవుతుంది. ప్రస్తుతం మష్రక్ పరిసర గ్రామాల్లో కరణ్ అసలు కుటుంబం ఏది? చట్టం ఎవరి వైపు నిలుస్తుంది? అనే చర్చ నడుస్తోంది.

Leave a Reply