భర్తకు విడాకులిచ్చి ప్రియుడి కోసం వచ్చిన నర్స్.. చెరకు తోటలో పొంచి ఉన్న ఘోర విపత్తు! పోలీసులనే ఉలిక్కిపడేలా చేసిన దారుణం!!

లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బిజ్నోర్‌లో ప్రేమ వ్యవహారంలో ముంబైకి చెందిన సనా అనే నర్సును.. ఆమె ప్రియుడు ఫైసల్ అత్యంత క్రూరంగా హత్య చేసి, శవాన్ని చెరకు తోటలో పూడ్చిపెట్టిన షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది.

ముంబైలోని ఒక ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తోన్న సనాకు.. అక్కడి ఒక మసాజ్ అండ్ స్పాలో పనిచేసే బిజ్నోర్ జిల్లాకు చెందిన ఫైసల్ అనే యువకుడితో పరిచయం ఏర్పడి, అది కాస్తా ప్రేమగా మారింది. ఫైసల్ ప్రేమలో మునిగిపోయిన సనా, అతడి కోసం తన భర్తకు విడాకులు ఇచ్చి, తన 9 ఏళ్ల కుమారుడితో కలిసి విడిగా నివసిస్తోంది.

విడాకుల తర్వాత తనను పెళ్లి చేసుకోవాలని ఫైసల్‌పై సనా నిరంతరం ఒత్తిడి తెస్తూ వచ్చింది. ఈ తరుణంలో, బక్రీద్ పండుగ కోసం ఫైసల్ యూపీలోని తన సొంత గ్రామానికి వెళ్లాడు. అతడిని వెతుక్కుంటూ మే 29వ తేదీన సనా ముంబై నుండి నేరుగా బిజ్నోర్‌కు చేరుకుంది. అక్కడ తనను వెంటనే వివాహం చేసుకోవాలని, అతడి కుటుంబ సభ్యులను కలవాలని సనా పట్టుబట్టింది. అయితే, పెళ్లికి ఇంకా రెండేళ్ల సమయం కావాలని ఫైసల్ కోరడంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో ఆగ్రహానికి గురైన సనా.. తాను ఫైసల్‌కు ఇచ్చిన డబ్బు, నగలను తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేసింది.

దారుణ హత్య.. చెరకు తోటలో శవం: దీంతో తీవ్ర ఆవేశానికి లోనైన ఫైసల్, సనాను తన బైక్‌పై ఎక్కించుకుని ఆ ప్రాంతంలోని ఒక అటవీ ప్రాంతానికి తీసుకువెళ్లాడు. అక్కడ ఇద్దరి మధ్య మళ్లీ గొడవ జరగడంతో.. ఫైసల్ సనా గొంతు నులిమి దారుణంగా హత్య చేశాడు. ఆపై ఎవరికీ అనుమానం రాకుండా ఆమె మృతదేహాన్ని ఒక చెరకు తోటలో గుంత తీసి పూడ్చిపెట్టాడు. అనంతరం ఏమీ తెలియనట్లు వెంటనే ముంబైకి పారిపోయాడు.

మరోవైపు సనా కనిపించకుండాపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సనా మొబైల్ లొకేషన్‌ను ట్రాక్ చేయగా అది బిజ్నోర్‌ను చూపించింది. దీంతో అనుమానం వచ్చిన ముంబై పోలీసులు ఫైసల్‌ను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా.. అతడు చేసిన ఘోరాన్ని ఒప్పుకున్నాడు. ప్రస్తుతం యూపీ పోలీసులు చెరకు తోట నుండి సనా మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *