లక్నో: సాధారణంగా నేరస్థులు జైలుకు వెళ్లాలంటే భయపడతారు. కానీ, ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఒక వింత ఖైదీ మాత్రం.. “నాకు ఈ జిల్లా జైలు నచ్చడం లేదు, నన్ను సెంట్రల్ జైలుకు మార్చండి” అంటూ పోలీసుల దగ్గర మొండికేసిన వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌ను ఊపేస్తోంది.
జైలు నచ్చలేదని ఫిర్యాదు:
“ఈ జిల్లా జైలు చాలా నాసిరకంగా ఉంది. ఇప్పటికే మూడుసార్లు అక్కడికి వెళ్లి వచ్చాను. అక్కడ అసలు మజా లేదు. అందుకే ప్లీజ్ సార్.. నన్ను ఈసారి ఎలాగైనా సెంట్రల్ జైలుకు పంపండి” అని అతను పోలీసులను బతిమాలుతుంటే.. ఆ మాటలు విన్న ఖైదీలకే కాదు, పోలీసులకు కూడా ఒక నిమిషం తల తిరిగిపోయింది. పోలీసు వాహనంలో కూర్చుని ఉన్న ఆ వ్యక్తి, తనను అరెస్ట్ చేశారన్న భయం ఏమాత్రం లేకుండా చాలా సహజంగా ఈ కోరిక కోరడం విశేషం.
హోటల్ రివ్యూలా జైలు విమర్శ:
జైలులోని సౌకర్యాలను ఏదో హోటల్ గ్రేడింగ్ ఇచ్చినట్లుగా అతను విమర్శిస్తుంటే.. అక్కడ ఉన్న పోలీసులు సైతం నవ్వు ఆపుకోలేక ఇబ్బంది పడ్డారు. ఈ వింత మరియు సరదా వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుండటంతో.. “ఒక ఖైదీ కూడా ఇలా ఆలోచిస్తాడా!” అంటూ నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

Leave a Reply