బీజింగ్: పాఠశాలల్లో చదువుకునే విద్యార్థుల మనసులు ఎంత కఠినంగా మారుతున్నాయో చెప్పడానికి అద్దం పట్టేలా.. చూసేవారి రక్తం గడ్డకట్టే ఒక అత్యంత దారుణమైన ఉదంతం చైనాలో వెలుగుచూసింది.
అక్కడ ఒక పాఠశాలలో చదువుతున్న ఇద్దరు విద్యార్థినులు, తమతో పాటు చదువుకునే మరో స్నేహితురాలిని బిల్డింగ్ పైకప్పు పైకి తీసుకెళ్లారు. అక్కడి నుండి ఆమెను కిందకు తోసేసి దారుణంగా హత్య చేయడానికి పూనుకున్నారు.
అంతేకాదు, ఆ అమ్మాయిని కిందకు తోసేసిన తర్వాత.. ఆమె బిల్డింగ్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుందని నమ్మించేలా ఒక పెద్ద నాటకానికి తెరతీశారు. ఈ దారుణ హత్యను ఆత్మహత్య కేసుగా మార్చేందుకు ఆ ఇద్దరు విద్యార్థినులు ఒక ప్రమాదకరమైన ‘మాస్టర్ ప్లాన్’ కూడా వేశారు. అయితే, గుండె లయ తప్పేలా ఆ ఇద్దరు అమ్మాయిలు వేసిన ఈ కుట్ర, చివరి నిమిషంలో అక్కడ ఉన్న ఒక ఉపాధ్యాయుడి (టీచర్) కారణంగా విఫలమైంది.
బిల్డింగ్ పైకప్పుపై ఆ విద్యార్థినులు అనుమానాస్పదంగా నిలబడటాన్ని చివరి క్షణంలో గమనించిన ఆ ఉపాధ్యాయుడు, వెంటనే అక్కడికి పరుగున వెళ్లి, ప్రమాద అంచుల్లో ఉన్న ఆ బాలికను చాకచక్యంగా కాపాడారు. పసి మనసుల్లో ఇంతటి క్రూరత్వమా అని యావత్ ప్రపంచాన్ని సైతం ఉలిక్కిపడేలా చేసిన ఈ దిగ్భ్రాంతికరమైన వార్త, ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Leave a Reply