కొలంబో: శ్రీలంకలో భారత్ ఎ, శ్రీలంక ఎ జట్ల మధ్య జరిగిన క్రికెట్ మ్యాచ్ కేవలం ఆటతోనే ముగిసిపోకుండా.. మైదానంలో రేగిన తీవ్ర ఉద్రిక్తతలతో ముగిసింది.

చివరి నిమిషం వరకు ఉత్కంఠభరితంగా సాగి ‘సూపర్ ఓవర్’ కు దారితీసిన ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓటమి చవిచూసింది. అయితే, మ్యాచ్ ముగిసిన తర్వాత భారత యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీతో లంక ఆటగాళ్లు కొందరు ఘర్షణకు దిగడం ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

ప్రస్తుతం శ్రీలంకలో భారత్ ఎ, ఆఫ్ఘనిస్తాన్ ఎ, శ్రీలంక ఎ జట్ల మధ్య ముక్కోణపు వన్డే సిరీస్ (Tri-Series) జరుగుతోంది. ఇందులో భాగంగా దంబుల్లా వేదికగా జరిగిన మ్యాచ్‌లో లంక జట్టుతో భారత్ తలపడింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ ఎ జట్టు 265 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన శ్రీలంక ఎ జట్టు కూడా 50 ఓవర్లలో ఖచ్చితంగా 265 పరుగులే చేయడంతో మ్యాచ్ ‘టై’ గా ముగిసింది.

ఆఖరి బంతికి డ్రామా.. సూపర్ ఓవర్:
మ్యాచ్ టై కావడంతో విజేతను తేల్చడానికి ‘సూపర్ ఓవర్’ నిర్వహించారు. ఇందులో మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టు 16 పరుగులు చేసింది. ఆ తర్వాత 17 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు మొదటి 5 బంతుల్లో కేవలం 9 పరుగులు మాత్రమే చేయగలిగింది. సూపర్ ఓవర్ ఆఖరి బంతికి భారత్ విజయానికి 8 పరుగులు అవసరమయ్యాయి. లంక బౌలర్ కుగదాస్ మదులన్ వేసిన ఆ చివరి బంతిని వైభవ్ సూర్యవంశీ సరిగ్గా ఆడలేకపోయాడు. మదులన్ అద్భుతమైన యార్కర్‌తో లంక విజయాన్ని ఖరారు చేశాడు. విజయం సాధించిన ఆనందంలో మదులన్‌తో పాటు లంక ఆటగాళ్లు మైదానంలో ఎగిరిగంతులేస్తూ సంబరాలు చేసుకున్నారు.

మైదానంలో ఘర్షణ:
అయితే, ఆ సంబరాల సమయంలో అక్కడ ఏదో జరిగింది. దాంతో తీవ్ర ఆగ్రహానికి గురైన వైభవ్ సూర్యవంశీ ఒక్కసారిగా లంక ఆటగాళ్లతో వాగ్వాదానికి దిగాడు. బౌలర్ మదులన్ సెలబ్రేషన్స్ చేసుకున్న విధానం నచ్చలేదా లేదా ఎవరైనా ఆయన్ను కవ్వించారా (Sledging) అనేది స్పష్టంగా తెలియదు కానీ, కోపంతో ఊగిపోయిన సూర్యవంశీ లంక ఆటగాడిని ఆవేశంగా పక్కకు నెట్టేశాడు. దానికి ప్రతిగా లంక ఆటగాళ్లు కూడా సూర్యవంశీ టీ షర్టు పట్టుకుని వెనక్కి నెట్టారు. దీంతో పిచ్‌పై కాసేపు తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

పరిస్థితి చేతులు దాటిపోతోందని గమనించిన శ్రీలంక సీనియర్ ఆటగాడు నిరోషన్ డిక్వెల్లా వెంటనే ఇరువర్గాల మధ్యలోకి వచ్చి సర్దిచెప్పాడు. ఒక సీనియర్ ప్లేయర్‌గా ఆయన సూర్యవంశీని శాంతింపజేసే ప్రయత్నం చేశాడు. మ్యాచ్ ముగిసి ఇరు జట్ల ఆటగాళ్లు కరచాలనం (Handshake) చేసుకునే సమయంలో కూడా సూర్యవంశీ తీవ్ర కోపంతోనే కనిపించాడు. చివరికి భారత ఆటగాళ్లు అతనికి నచ్చజెప్పి పవలిలియన్‌కు తీసుకెళ్లారు.

అంపైర్లతో తులక్ వర్మ వాగ్వాదం:
ఈ మ్యాచ్‌లో కేవలం సూర్యవంశీ మాత్రమే కాకుండా, భారత కెప్టెన్ తిలక్ వర్మ కూడా అంపైర్లతో పలుమార్లు వాగ్వాదానికి దిగాడు. మొదట, మైదానంలో తగినంత వెలుతురు (Bad Light) లేదని అంపైర్లు మ్యాచ్ ఆపాలని చూసినప్పుడు.. సూపర్ ఓవర్ ఆడటానికి ఈ వెలుతురు సరిపోతుందని తిలక్ వాదించాడు. ఆ తర్వాత సూపర్ ఓవర్ సమయంలో అంపైర్ ఇచ్చిన ఒక నో-బాల్ (No-Ball) నిర్ణయంపై కూడా ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు.

Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *