“నాన్న కింద పడినప్పుడు ఆ చిన్నారి భయపడి ఏడుస్తుందేమో అనుకున్నాం, కానీ ఆయన నవ్వడం చూసి ఆ పాప కూడా ‘హా హా’ అంటూ నవ్విన నవ్వు ఉందే.. అద్భుతం!”
అంటూ ఒక నెటిజన్ ఎంతో భావోద్వేగంతో సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. తన తండ్రి కింద పడిపోవడం చూసిన ఒక చిన్నారి.. ఆయనకు దెబ్బ తగిలిందేమోనని కంగారు పడకుండా, మొదట తండ్రి ముఖంలో నవ్వు చూసే వరకు ఆగి, ఆ తర్వాతే తను కూడా ఎంతో అందంగా నవ్విన ఈ అపురూపమైన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ లక్షలాది మంది నెటిజన్ల హృదయాలను గెలుచుకుంటోంది.
ఆ వైరల్ వీడియో వివరాల్లోకి వెళ్తే.. ఒక తండ్రి కుర్చీలో కూర్చోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు, అది అనుకోకుండా పక్కకు జరిగి ఆయన ఒక్కసారిగా కింద పడిపోతారు. దానిని నిశితంగా గమనిస్తున్న ఆ చిన్నారి.. నాన్నకు దెబ్బ తగిలిందేమోననే భయంతో మొదట నవ్వకుండా ఎంతో గంభీరంగా, నిశ్శబ్దంగా చూస్తూ ఉండిపోతుంది.
కానీ, ఆ తండ్రి వెంటనే లేచి మళ్లీ కుర్చీలో కూర్చుని.. తన నొప్పిని దాచుకుంటూ బిడ్డ వైపు చూసి ఒక్కసారిగా నవ్వుతారు. అంతే, ఆ మరుక్షణమే ఆ పసిపాప తన మనసులోని భయాన్ని వీడి, తండ్రిని ప్రేమతో హత్తుకున్నట్లుగా ఎంతో ముద్దుగా నవ్వడం ప్రారంభిస్తుంది. ఈ అద్భుతమైన దృశ్యాన్ని చూసిన నెటిజన్లు “ప్రపంచంలోనే అత్యంత స్వచ్ఛమైన ప్రేమ ఇదే” అంటూ కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ హార్ట్ టచింగ్ వీడియో నెట్లో తెగ వైరల్ అవుతూ అందరినీ ఆకట్టుకుంటోంది.

Leave a Reply