“అయ్యో.. మనం ఎంతో ఇష్టంగా తినే సమోసా వెనుక ఇంత పెద్ద ద్రోహమా?”.. కాళ్లతో పిండి పిసికిన కిరాతకం.. గుండె గుభేల్‌మనే వీడియో!

ఆహార ప్రియుల ఫేవరెట్ స్నాక్స్ అయిన సమోసా మరియు కచోరీల తయారీలో వెలుగుచూసిన ఒక దారుణమైన ఘటన సోషల్ మీడియాలో తీవ్ర కలకలం రేపుతోంది.

తినుబండారాల తయారీ కోసం ఉపయోగించే మైదా పిండిని, ఒక వ్యక్తి కనీస మానవత్వం లేకుండా తన కాళ్లతో తొక్కుతూ పిసుకుతున్న వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఇది చూసిన ఎవరికైనా వాంతులు వచ్చేంత అసహ్యం వేస్తోంది. ప్రజల ఆరోగ్యం గురించి కనీసం పట్టించుకోకుండా, అత్యంత అపరిశుభ్రమైన వాతావరణంలో ఆహారాన్ని తయారు చేస్తున్న ఈ ఘోరమైన దృశ్యం.. స్నాక్స్ ప్రియులలో తీవ్ర ఆగ్రహాన్ని, అసహ్యాన్ని కలిగిస్తోంది.

ఆహార భద్రతా అధికారులకు ప్రజల విజ్ఞప్తి:
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోను చూసిన ఎవరైనా సరే.. “ఇకపై బయట షాపుల్లో సమోసాల జోలికే వెళ్లకూడదు” అనేంతగా పరిస్థితి దారుణంగా తయారైంది. కేవలం లాభాలే ధ్యేయంగా పెట్టుకుని, ప్రజల ప్రాణాలతో, ఆరోగ్యంతో ఆడుకుంటున్న ఇలాంటి హోటళ్లు, ఫుడ్ తయారీదారులపై ఫుడ్ సేఫ్టీ (ఆహార భద్రత) అధికారులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని సామాజిక కార్యకర్తలు, ప్రజలు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు.


Posted

in

by

Tags: