“నువ్వు నాకు దక్కకపోతే ఎవరికీ దక్కకూడదు”.. అర్ధరాత్రి ఇల్జొచ్చిన అత్త కొడుకు..! ఇద్దరు పిల్లల తల్లిని తల్లడిల్లేలా.. స్నేహితులున్నా జరిగిన ఘోరం.!!!

చెన్నై: బెంగళూరుకు చెందిన రేష్మా (29) అనే మహిళకు, చెన్నై పల్లవరం ప్రాంతానికి చెందిన అశోక్ అనే వ్యక్తితో 10 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.

ఇటీవల భర్తతో వచ్చిన కుటుంబ కలహాల కారణంగా ఆమె అతనికి దూరంగా ఉంటోంది. గత రెండు నెలలుగా తన పిల్లలతో కలిసి రేష్మా ఒంటరిగా నివసిస్తోంది. అయితే, రేష్మా ఒంటరిగా ఉంటున్న విషయాలు తెలుసుకున్న ఆమె అత్త కుమారుడు విజి.. తరచూ రేష్మా ఇంటికి వచ్చి తనను పెళ్లి చేసుకోవాలంటూ గొడవ పడేవాడు, మానసికంగా వేధించేవాడు.

బెదిరింపులతో భయపడి స్నేహితులను పిలిపించుకున్న రేష్మా:
ఘటన జరగడానికి ముందు రోజు రాత్రి కూడా రేష్మా ఇంటికి వచ్చిన విజి.. “నువ్వు నాతో కలిసి జీవించకపోతే ఇక ఎవరితోనూ బతకలేవు, నిన్ను చంపేస్తాను” అని తీవ్రంగా బెదిరించి వెళ్లాడు. విజి బెదిరింపులతో తీవ్ర భయాందోళనకు గురైన రేష్మా.. ఆ రాత్రి తనకు తోడుగా ఉండేందుకు తన స్నేహితురాలు మరియా మరియు ఆమె సోదరి జెన్నిఫర్‌లను తన ఇంటికి పిలిపించుకుని వారితో పాటే పడుకుంది.

అర్ధరాత్రి అక్రమ ప్రవేశం – పెప్పర్ స్ప్రేతో దాడి:
మరుసటి రోజు తెల్లవారుజామున సుమారు 3:30 గంటల సమయంలో విజి మళ్లీ రేష్మా ఇంటికి వచ్చాడు. ప్రధాన తలుపు లోపలి నుండి లాక్ చేసి ఉండటంతో.. కిటికీ గుండా చేతులు పెట్టి గడియ తీసి బలవంతంగా ఇంట్లోకి చొరబడ్డాడు.

అక్కడ ఉన్న మరియా, జెన్నిఫర్ వెంటనే పోలీసులకు ఫోన్ చేయడానికి ప్రయత్నించారు. కానీ నిందితుడు విజి తాను ముందే దాచి తెచ్చుకున్న ‘పెప్పర్ స్ప్రే’ (మిరియాల పొడి స్ప్రే) ను వారి కళ్లల్లో చల్లి, వారిపై విచక్షణారహితంగా దాడి చేశాడు.

కళ్ళెదుటే కిరాతక హత్య:
ఆ గందరగోళంలో రేష్మా ఏం జరుగుతుందో తెలుసుకుని అప్రమత్తమయ్యే లోపే.. విజి తన వద్ద ఉన్న కత్తితో ఆమె ముఖం, చేతులు, కాళ్లు, మెడపై విచ్చలవిడిగా పొడిచాడు. తీవ్రమైన గాయాల పాలైన రేష్మా.. రక్తపు మడుగులో అక్కడికక్కడే తల్లడిల్లుతూ ప్రాణాలు విడిచింది.

ఆడవారి గట్టి కేకలు, ఆర్తనాదాలు విని చుట్టుపక్కల వారు పరుగెత్తుకుంటూ వచ్చేలోపే విజి అక్కడి నుండి చాకచక్యంగా పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని రేష్మా మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘోర ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుడు విజి కోసం అత్యంత ముమ్మరంగా గాలిస్తున్నారు.


Posted

in

by

Tags: