“అతను అసలు మగాడే కాదు.!” మరి ఇద్దరు పిల్లలు ఎలా పుట్టారు..? రాజధానిని వణికించిన 11 ఏళ్ల బాలిక హత్య కేసులో ఊహించని ట్విస్ట్.. సమాధానం దొరక్క పోలీసుల తల పట్టుకున్నారు..!

న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఛతర్‌పూర్ మెట్రో స్టేషన్ సమీపంలో జూన్ 22 తెల్లవారుజామున ఫుట్‌పాత్‌పై తన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల మధ్య నిద్రిస్తున్న 11 ఏళ్ల బాలికను పాషు కుమార్ అనే క్యాబ్ డ్రైవర్ కిడ్నాప్ చేసి దారుణంగా హత్య చేసిన ఉదంతం దేశ రాజధానిని కుదిపేసింది.

బీహార్‌కు చెందిన నిందితుడు పాషు కుమార్ గత ఐదేళ్లుగా ఢిల్లీలో నివసిస్తున్నాడు. మొదట్లో సెక్యూరిటీ గార్డుగా పనిచేసిన అతను, ఆ తర్వాత క్యాబ్ డ్రైవర్‌గా మారాడు.

నడిరోడ్డుపై కిడ్నాప్ – తండ్రి ప్రతిఘటన:
ఘటన జరిగిన రోజున నిందితుడు తన కారును ఫుట్‌పాత్ సమీపంలో ఆపి, నిద్రిస్తున్న బాలికను బలవంతంగా కారులోకి నెట్టాడు. కారు స్టార్ట్ చేసే సమయంలో నిద్రమత్తులో ఉన్న బాలిక తన తండ్రిని గట్టిగా పిలిచింది. అది విన్న తండ్రి పరుగున వచ్చి కారు వెనుక భాగంలో కర్రతో కొట్టి ఆపడానికి ప్రయత్నించినప్పటికీ, నిందితుడు పాషు కుమార్ కారును వేగంగా పోనిచ్చి అక్కడి నుండి పారిపోయాడు. కారులోనే బాలికను తీవ్రంగా భయపెట్టిన నిందితుడు, ఆమెను ఒక నిర్మానుష్య అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి లైంగిక దాడికి యత్నించాడు.

వైద్య పరీక్షల్లో షాకింగ్ నిజం – కేసులో పెను మిస్టరీ:
అయితే, తనకున్న నపుంసకత్వం (Impotence ) కారణంగా ఆ ప్రయత్నం విఫలమైంది. దాంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన నిందితుడు బాలికను కర్రతో కొట్టి దారుణంగా హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని గుర్తుపట్టకుండా రాళ్ల కింద దాచిపెట్టాడు. హత్య చేసిన కొన్ని గంటల్లోనే అతను తన గదికి వెళ్లి బట్టలు మార్చుకుని, ఏమీ తెలియనట్లు మళ్లీ క్యాబ్ నడపడానికి బయలుదేరినట్లు పోలీసుల విచారణలో తేలింది.

పసుపు రంగు నంబర్ ప్లేట్ (కమర్షియల్ వాహనం) కలిగిన కారు అనే ఒకే ఒక్క ఆధారంతో రంగంలోకి దిగిన ఢిల్లీ పోలీసులు, ఆ ప్రాంతంలోని సీసీటీవీ (CCTV) ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలించి నిందితుడు పాషు కుమార్‌ను అరెస్ట్ చేశారు.

అయితే, విచారణలో భాగంగా నిందితుడికి నిర్వహించిన వైద్య పరీక్షల్లో అతనికి ‘నపుంసకత్వం’ ఉన్నట్లు వైద్యులు ధృవీకరించారు. ఇక్కడే పోలీసులకు ఒక పెద్ద పజిల్ (సమస్య) ఎదురైంది. బీహార్‌లో నివసిస్తున్న ఈ నిందితుడికి 4 ఏళ్ల వయసున్న ఒక కుమారుడు, 6 నెలల వయసున్న మరొక కుమారుడు ఉన్నారు. మెడికల్ రిపోర్టులో అతనికి శారీరక సామర్థ్యం లేదని తేలగా, మరి అతనికి ఇద్దరు పిల్లలు ఎలా పుట్టారనేది ఇప్పుడు పోలీసులకు పెద్ద మిస్టరీగా మారింది.

నేర చరిత్ర:
నిందితుడి నేపథ్యాన్ని తవ్వగా.. అతనిపై ఇప్పటికే బీహార్‌లో రెండు హత్యాయత్నం కేసులు సహా మొత్తం 5 క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ చిక్కుముడిని విప్పేందుకు మరియు బాలిక హత్యకు సంబంధించి మరిన్ని సాక్ష్యాలను సేకరించేందుకు ఢిల్లీ పోలీసులు తమ విచారణను మరింత ముమ్మరం చేశారు.


Posted

in

by

Tags: