న్యూజిలాండ్ మరియు ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ సందర్భంగా, ఇంగ్లండ్ ఆటగాళ్లు జోఫ్రా ఆర్చర్ మరియు షోయబ్ బషీర్ మధ్య మైదానంలోనే ఒక చేదు సంఘటన చోటుచేసుకుంది.
మ్యాచ్‌లో 113వ ఓవర్ సమయంలో, ఆర్చర్ బౌలింగ్‌లో టామ్ బ్లండెల్ ఇచ్చిన సులభమైన క్యాచ్‌ను బషీర్ వదిలేయడంతో, ఆర్చర్ తీవ్ర అసహనానికి లోనయ్యాడు. దీనివల్ల మైదానంలో ఆర్చర్ ప్రదర్శించిన ఆగ్రహం పెద్ద చర్చకు దారితీసింది.
ఆ మరుసటి ఓవర్లో బషీర్ అద్భుతంగా క్యాచ్ పట్టుకుని వికెట్ తీసినప్పుడు, మిగతా ఆటగాళ్లందరూ సంబరాలు చేసుకున్నా, ఆర్చర్ మాత్రం బౌండరీ లైన్ దగ్గరకు వెళ్లి ఒంటరిగా ఉండిపోయాడు.
కెప్టెన్ బెన్ స్టోక్స్ జోక్యం చేసుకుని ఆర్చర్‌ను పిలిచిన తర్వాతే, అతను వచ్చి మిగతా ఆటగాళ్లతో కలిసి సంబరాల్లో పాల్గొన్నాడు. బషీర్ చెయ్యి ముందుకు చాచడంతో అయిష్టంగానే షేక్ హ్యాండ్ ఇచ్చినప్పటికీ, ఆర్చర్ ముఖంలో ఉన్న అసహనం స్పష్టంగా కనిపించింది.
అదే ఓవర్లో బషీర్ మరో వికెట్ తీసి సత్తా చాటాడు. న్యూజిలాండ్ తన మొదటి ఇన్నింగ్స్‌లో 438 పరుగులు చేయగా, ఇంగ్లండ్ జట్టు 354 పరుగులకు ఆలౌట్ అయింది. ప్రస్తుతం న్యూజిలాండ్ తన రెండో ఇన్నింగ్స్ కొనసాగిస్తుండగా, ఈ ఆర్చర్-బషీర్ వివాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
