“ప్రమాదకరమైన మొక్కు.. నిప్పుల్లో కాలు జారి పడి యువకుడి మృతి.. మొహర్రం వేడుకలో విషాదం.. వైరల్ అవుతున్న వీడియో..!!”

మొహర్రం పండుగ సందర్భంగా నిర్వహించిన అగ్ని ప్రవేశం (తీ మిది) వేడుకల్లో చోటుచేసుకున్న ఒక హృదయ విదారక ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం ‘ఎక్స్’ (X) సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఆ వీడియోలో, దేవేంద్ర (28) అనే యువకుడు తన మొక్కు తీర్చుకోవడానికి నిప్పుల గుండంలో నడవడం ప్రారంభిస్తాడు. అకస్మాత్తుగా అతని కాలు తడబడటంతో, అతను నియంత్రణ కోల్పోయి మండుతున్న నిప్పుల్లోనే పడిపోతాడు.

మరుక్షణమే అతని శరీరం అంతా అంటుకోవడంతో, అక్కడున్న వారు భయాందోళనలతో అతడిని రక్షించడానికి ప్రయత్నించే దృశ్యాలు ఆ వీడియోలో రికార్డయ్యాయి. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆ యువకుడిని వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ, చికిత్స పొందుతూ దురదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోయాడు. చూసేవారిని భయాందోళనకు గురిచేస్తున్న ఈ ప్రమాద వీడియో ప్రస్తుతం నెటిజన్లలో తీవ్ర విషాదాన్ని, షాక్‌ను కలిగిస్తోంది.


Posted

in

by

Tags: