“ప్రియుడితో కలిసి కాబోయే భర్తను 400 అడుగుల లోయలోకి నెట్టి చంపిన క్రూరత్వం”.. 12 గంటల విచారణలో నివ్వెరపోయిన తల్లిదండ్రులు.!!!

మహారాష్ట్రలోని పూణేలో సంచలనం సృష్టించిన కేతన్ అగర్వాల్ హత్య కేసులో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి.

కేతన్ అగర్వాల్‌ను 400 అడుగుల లోతైన లోయలోకి నెట్టి అత్యంత దారుణంగా హత్య చేశారు. ఈ కేసును దర్యాప్తు చేసిన పోలీసులకు విస్తుపోయే నిజాలు తెలిశాయి. కేతన్‌ను హత్య చేసింది ఎవరో కాదు, అతనికి త్వరలో భార్యగా రావాల్సిన సియా గోయల్ మరియు ఆమె ప్రియుడు చేతన్ చౌదరి అని తేలింది. పోలీసుల సుమారు 12 గంటలకు పైగా సాగిన సుదీర్ఘ విచారణలో సియా గోయల్ అసలు స్వరూపం, ఆమె పన్నిన కుట్ర బయటపడింది.

ఈ దారుణ హత్యలో సియా గోయల్ పాత్ర నిర్ధారణ కావడంతో, ఆమె స్వంత తల్లిదండ్రులు కూడా ఆమెకు మద్దతు తెలపలేదు. కూతురి దారుణ చర్యను చూసి షాక్‌కు గురైన వారు, ఆమెను పూర్తిగా వదిలేశారు. పోలీసుల నిశిత విచారణతో ఈ హత్య కేసులోని కుట్ర కోణం మొత్తం ప్రస్తుతం బయటపడింది.


Posted

in

by

Tags: