ప్రియురాలిని చంపి, మృతదేహాన్ని తరలిస్తుండగా గుండెపోటుతో మరణించిన ప్రియుడు! విషాదం!

అమెరికాలోని అలబామాలో ఒక భయానక ఘటన వెలుగులోకి వచ్చింది. 44 ఏళ్ల డానియల్ రాబిన్స్ తన 47 ఏళ్ల ప్రియురాలు జెస్సీ ఫోల్డ్స్‌ను గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం ఆమె మృతదేహాన్ని తరలించి, ఎక్కడైనా పారేయాలని ప్రయత్నిస్తుండగా, అతనికి గుండెపోటు వచ్చి అక్కడికక్కడే మరణించాడు.

ఏమి జరిగింది? జూన్ 10న అలబామాలోని చాంబర్స్ కౌంటీలో ఒక వాహనం రోడ్డు పక్కన అనుమానాస్పదంగా నిలిచి ఉండటాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకోగా, అడవి ప్రాంతంలో ఇద్దరి మృతదేహాలు పక్కపక్కనే కనిపించాయి. మృతుడు రాబిన్స్‌కు గతంలోనే గుండె సంబంధిత సమస్యలు ఉన్నట్లు విచారణలో తేలింది. జెస్సీ ఫోల్డ్స్ మృతదేహాన్ని తరలిస్తున్న సమయంలోనే అతనికి గుండెపోటు వచ్చిందని డిస్ట్రిక్ట్ అటార్నీ మైక్ సెగ్రెస్ట్ ధృవీకరించారు.

గృహహింస కారణంగానేనా? ఈ ఘటన గృహహింస వల్ల జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నప్పుడు వాహనం ఇంజిన్ ఇంకా నడుస్తూనే ఉంది, బహుశా అంతకుముందు రాత్రే ఈ హత్య జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు. జెస్సీ ఫోల్డ్స్ గొంతు నులిమి హత్య చేయబడినట్లు పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. ఇద్దరి మృతదేహాలు ఒకే చోట పడి ఉండటం స్థానికంగా కలకలం రేపింది.


Posted

in

by

Tags: