ఒక్క రాత్రి మాత్రమే..! ‘స్పైడర్ మ్యాన్’లా బిల్డింగ్ దూకి నగలు, డబ్బుతో పారిపోయిన నవవధువు.. నిద్ర లేచి చూసిన వరుడికి షాక్..!!!

గ్వాలియర్: మధ్యప్రదేశ్ రాష్ట్రం గ్వాలియర్ సమీపంలోని జర్‌గావ్ గ్రామానికి చెందిన జితేంద్ర జోషికి, మొరీనాకు చెందిన నమ్రతా జోషితో జూన్ 29న వైభవంగా వివాహం జరిగింది.

అసలేం జరిగింది? వివాహం తర్వాత అత్తగారింటికి వచ్చిన నమ్రత అక్కడ కేవలం ఒక్క రాత్రి మాత్రమే ఉంది. జూన్ 30 తెల్లవారుజామున 4 గంటలకు, ఇంట్లో వారంతా గాఢనిద్రలో ఉన్న సమయంలో నమ్రత తన అసలు స్వరూపాన్ని బయటపెట్టింది. ఇంట్లో ఉన్న విలువైన బంగారు నగలను, నగదును దొంగిలించి పరారయ్యేందుకు ప్లాన్ చేసింది. ఇంటి ప్రధాన ద్వారాలన్నీ వేసి ఉండటంతో, సినిమా స్టైల్‌లో రెండో అంతస్తు నుండి పక్కనే ఉన్న ఇంటి మేడపైకి దాదాపు 23 అడుగుల ఎత్తు నుండి దూకేసింది. ఆపై స్పైడర్ మ్యాన్ తరహాలో ఇనుప గ్రిల్స్ పట్టుకుని కిందకు దిగి, అక్కడి నుండి పరారైంది.

ఉదయం నిద్ర లేచిన వరుడు జితేంద్ర తన భార్య కనిపించకపోవడంతో షాక్‌కు గురయ్యాడు. సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా, తెల్లవారుజామున ఆమె పారిపోతున్న దృశ్యాలు కనిపించాయి.

ట్విస్ట్ ఇచ్చిన వధువు: దీనిపై జితేంద్ర పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు వధువు తండ్రిని సంప్రదించారు. కుటుంబ సభ్యులు నమ్రతను తీసుకుని పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. అక్కడ ఆమె మాట మార్చి, “నేను నా భర్తతోనే ఉండాలనుకుంటున్నాను” అని యూ-టర్న్ తీసుకుంది. ఆమె కుటుంబ సభ్యులు కూడా జితేంద్రను ఆమెను తీసుకెళ్లమని ఒత్తిడి చేశారు. కానీ, పెళ్లయిన కొన్ని గంటల్లోనే నగలు, డబ్బుతో పారిపోయిన ఆమెతో జీవించడం తన ప్రాణాలకే ప్రమాదమని జితేంద్ర స్పష్టం చేశాడు. “ఆమె భవిష్యత్తులో నన్ను చంపేసే అవకాశం కూడా ఉంది, అలాంటి వ్యక్తితో నేను కలిసి ఉండలేను” అని తేల్చిచెప్పిన జితేంద్ర, తనకు రక్షణ కల్పించాలని పోలీసులకు లిఖితపూర్వక ఫిర్యాదు చేశాడు.


Posted

in

by

Tags: