“మూడేళ్లుగా నల్లగా ఉన్నావని అందరూ దూరం పెట్టారు”.. పెళ్లి కాలేదని 22 ఏళ్ల యువతి దారుణ నిర్ణయం.. గుండెను పిండేసే విషాదం!!

బీహార్: ఆధునిక కాలంలో కూడా మనిషి గుణాన్ని చూడకుండా, చర్మం రంగును బట్టి అంచనా వేసే దారుణమైన ‘వర్ణ వివక్ష’ ఇంకా మారలేదనడానికి బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లో జరిగిన ఈ ఘటనే నిదర్శనం.

అక్కడ 22 ఏళ్ల యువతికి పెళ్లి సంబంధాలు చూడటం కోసం ఆమె తల్లిదండ్రులు గత మూడేళ్లుగా (ఆమెకు 19 ఏళ్లు ఉన్నప్పటి నుండి) తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే, ఆమె చర్మం రంగు కొంచెం నల్లగా ఉందనే ఒక్క కారణంతోనే, వచ్చిన 10కి పైగా పెళ్లి సంబంధాలు ఆమెను తిరస్కరించాయి. దీనివల్ల తీవ్ర మానసిక వేదనకు, “నాకు అసలు పెళ్లే కాదేమో” అనే నిరాశకు లోనైన ఆ యువతి, జూన్ 1వ తేదీ ఉదయం తన గదిలోనే ఆత్మహత్య చేసుకుని విగతజీవిగా కనిపించింది.

సమాచారం అందుకున్న పోలీసులు మరియు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ (FSL) బృందం ఘటనాస్థలానికి చేరుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి విచారణ చేపడుతున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న నెటిజన్లు, “పెళ్లి కాలేదని ప్రాణాలు తీసుకోవడానికి 22 ఏళ్లు ఏమైనా జీవితంలో చివరి వయసా? సాధించాల్సిన వయసులో ఇంతటి దారుణమైన నిర్ణయమా?” అని ఆ యువతి మృతికి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేవలం చర్మం రంగును బట్టి ఒక యువతి జీవితాన్ని, ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్న ఈ సమాజపు సంకుచిత ధోరణిని తీవ్రంగా విమర్శిస్తున్నారు.


Posted

in

by

Tags: