అర్ధరాత్రి భార్యాభర్తలు నిర్మానుష్య ప్రాంతంలో ఏం చేస్తున్నారు? తెల్లారేసరికి ఘోరం.. రెండు ప్రాణాలు గాలిలో కలిశాయి!

మధ్యప్రదేశ్‌లోని చింద్వారా జిల్లాలో జరిగిన ఒక షాకింగ్ కేసులో సంచలన తీర్పు వెలువడింది. ‘నీలాంటి వారిని వేలమందిని భర్తలుగా తెచ్చుకోగలను’ అని భార్య అనడంతో ఆగ్రహించిన భర్త, ఆమెను హత్య చేశాడు. అయితే, ఈ కేసులో తాజాగా హైకోర్టు శిక్షను తగ్గించడం ఇప్పుడు చట్టపరమైన మరియు సామాజిక చర్చకు దారితీస్తోంది.

హైకోర్టు తీర్పు వెనుక ఉన్న కారణం: శివ అనే వ్యక్తి తన గర్భిణీ భార్య కిరణ్‌ను హత్య చేసిన కేసులో కింది కోర్టు అతనికి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. దీనిపై శివ హైకోర్టులో అప్పీలు చేయగా, జస్టిస్ వివేక్ అగర్వాల్ మరియు జస్టిస్ అవనీంద్ర కుమార్ సింగ్‌లతో కూడిన ధర్మాసనం సదరు భర్త శిక్షను 7 ఏళ్లకు తగ్గించింది. భార్య అన్న మాటలు ‘తీవ్రమైన మరియు తక్షణ ప్రేరేపణ’ (Grave and Sudden Provocation) కిందికి వస్తాయని కోర్టు అభిప్రాయపడింది.

ఏం జరిగింది? జూలై 2021లో, కుల్బేహ్రి నది ఒడ్డున శివ మరియు అతని ఏడు నెలల గర్భిణీ భార్య కిరణ్ మధ్య గొడవ జరిగింది. ఆ సమయంలో కిరణ్, “నీలాంటి వాళ్లను వేలమందిని భర్తలుగా ఉంచుకోగలను” అని అనడంతో, శివ కోపంతో ఊగిపోయి పక్కనే ఉన్న రాయిని తీసుకుని ఆమెపై దాడి చేశాడు. దాంతో ఆమె అక్కడికక్కడే మరణించింది. కిరణ్ చనిపోయిన వెంటనే, శివ స్వయంగా పోలీసులకు, బంధువులకు ఫోన్ చేసి విషయం చెప్పేశాడు.

కోర్టు విశ్లేషణ:

  • శివ ముందే ప్లాన్ చేసి హత్య చేసి ఉంటే, అతనే పోలీసులకు సమాచారం ఇచ్చేవాడు కాదని కోర్టు పేర్కొంది.
  • దాడికి ఉపయోగించిన రాయి ముందుగానే సిద్ధం చేసుకున్నది కాదని, అది అక్కడే దొరికిందని కోర్టు గమనించింది.
  • దాడి జరిగిన ప్రాంతం రాళ్లతో ఉన్న నది తీరం కావడంతో, కొన్ని గాయాలు రాయి వల్ల కాకుండా పడటం వల్ల కూడా జరిగి ఉండవచ్చని కోర్టు అభిప్రాయపడింది.
  • భార్య చేసిన వ్యాఖ్య భర్త యొక్క ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉందని, ఇది అతనిని ఆవేశంలో హత్య చేసేలా ప్రేరేపించిందని భావించి, శిక్షను ఐపీసీ సెక్షన్ 304 పార్ట్ II కిందకు మార్చింది.

Posted

in

by

Tags: