తల్లిదండ్రుల స్వార్థం, అహంకారం వల్ల ఒక చిన్నారి అనాథాశ్రమం పాలు కావాల్సిన పరిస్థితి ఎదురవ్వడం సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది.
ఏం జరిగింది? విడాకులు తీసుకున్న దంపతులు, విడాకుల ప్రక్రియ పూర్తయ్యాక తమ సొంత బిడ్డను పెంచుకోవడానికి ఇద్దరూ నిరాకరించారు. “నాకు బిడ్డ వద్దు” అని తల్లి, “నేను పెంచలేను” అని తండ్రి మొండిగా వాదించడంతో, ఆ అమాయక చిన్నారి అనాథాశ్రమానికి పంపబడింది.
తాము కన్న బిడ్డను ఒక భారంగా భావించి, ఇలా వదిలించుకున్న తల్లిదండ్రులపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. “ఈ కాలంలో రక్తసంబంధాలకు, తల్లిదండ్రుల ప్రేమకు విలువ లేకుండా పోయిందా?” అని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ అహంకారం కోసం బిడ్డ భవిష్యత్తును నాశనం చేసిన ఆ తల్లిదండ్రులపై సోషల్ మీడియాలో విమర్శల వర్షం కురుస్తోంది.

Leave a Reply