“చేతిలో బంగారం ఉంది.. ఇక భయమెందుకు! బంగారు ఆభరణాలపై రుణాల కొత్త ట్రెండ్.. భారతీయుల ఆలోచనా దృక్పథం పూర్తిగా మారింది!”

తంలో మధ్యతరగతి మరియు పేద కుటుంబాలు అత్యవసర వైద్య ఖర్చుల కోసం మాత్రమే బంగారాన్ని తాకట్టు పెట్టేవారు. కానీ, ఇప్పుడు పరిస్థితి మారింది. బంగారం ఒక ముఖ్యమైన ఆర్థిక వనరుగా మారుతోంది.

గత ఏడాది కాలంలో బంగారం ధరలు చారిత్రాత్మక గరిష్టాలకు చేరుకోవడంతో, బంగారాన్ని తాకట్టు పెట్టి రుణాలు తీసుకునే ధోరణి భారతదేశంలో వేగంగా పెరుగుతోంది. ఇది కేవలం తాత్కాలిక మార్పు మాత్రమేనని కాకుండా, భారతీయుల ఆర్థిక దృక్పథంలో వస్తున్న పెను మార్పు అని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.

ఆర్బీఐ డేటా ఏం చెబుతోంది? భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) గణాంకాల ప్రకారం, 2026 మే నాటికి బ్యాంకేతర ఆర్థిక సంస్థలు (NBFCs) జారీ చేసిన గోల్డ్ లోన్లు గత ఏడాదితో పోలిస్తే 70 శాతం పెరిగాయి. బ్యాంకేతర ఆర్థిక సంస్థల మొత్తం రుణాల్లో గోల్డ్ లోన్ల వాటా 2024 మే నెలలో 3 శాతం ఉండగా, అది ఇప్పుడు 6 శాతానికి చేరుకుంది.

గోల్డ్ లోన్ల జోరు: మొత్తం గోల్డ్ లోన్ల విలువ 3.3 లక్షల కోట్లకు చేరుకుంది. కేవలం బ్యాంకేతర సంస్థలే కాకుండా, ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు కూడా ఇదే ధోరణిని చూస్తున్నాయి. బ్యాంకులు మంజూరు చేసిన గోల్డ్ లోన్లు ఒక సంవత్సరంలో 150 శాతం పెరిగి, 2026 మే నాటికి 5.1 లక్షల కోట్లకు చేరుకున్నాయి. గతంలో “అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బంగారం తాకట్టు” అనే మానసిక స్థితి ఉండగా, ఇప్పుడు “తక్కువ వడ్డీకి నగదు పొందడానికి బంగారం ఒక సాధనం” అనే ఆర్థిక ప్రణాళికా దృక్పథం పెరిగింది.

ఎందుకు ఈ మార్పు? ప్రస్తుతం గోల్డ్ లోన్లు తీసుకునే వారిలో మంచి ఆదాయం ఉన్న కస్టమర్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. మంచి జీతాలు ఉన్నవారే ఇప్పుడు బంగారంపై రుణాలు తీసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. గతంలో 42 శాతంగా ఉన్న ఈ నిష్పత్తి ఇప్పుడు 52 శాతానికి పెరిగింది. వివాహాలు, వైద్య అవసరాలే కాకుండా.. వ్యాపార విస్తరణ, విదేశీ ప్రయాణాలు, పిల్లల ఉన్నత విద్య, పెట్టుబడులు వంటి అనేక అవసరాల కోసం బంగారంపై రుణాలు తీసుకుంటున్నారు.

ఆర్బీఐ హెచ్చరిక: సాధారణ వ్యక్తిగత రుణాల (Personal Loans) కంటే బంగారంపై ఇచ్చే రుణాలు బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు సురక్షితమైనవిగా పరిగణించబడతాయి. అయితే, గత కొన్ని నెలల్లో బంగారం ధరలు గరిష్ట స్థాయికి చేరిన తర్వాత, ఇప్పుడు స్వల్పంగా తగ్గుముఖం పట్టడం ఆర్బీఐని ఆందోళనకు గురిచేస్తోంది. బంగారం ధరలు నిరంతరం తగ్గితే, తాకట్టు పెట్టిన ఆస్తుల విలువ తగ్గి బ్యాంకుల భద్రత ప్రశ్నార్థకం కావచ్చు. అంతేకాకుండా, రుణాలు తిరిగి చెల్లించడంలో ఇబ్బందులు తలెత్తవచ్చని ఆర్బీఐ హెచ్చరించింది. కాబట్టి, బంగారం ధరల్లోని హెచ్చుతగ్గులను ఆర్థిక సంస్థలు నిరంతరం పర్యవేక్షించాలని సూచించింది.


Posted

in

by

Tags: