లగ్జరీ హోటళ్లలో గాజు బాత్‌రూమ్‌ల వెనుక ఉన్న అసలు రహస్యం ఇదే! ఎవరూ ఊహించని కారణాలు ఇవే..

మనం తరచుగా లగ్జరీ హోటళ్లు లేదా రిసార్టులకు వెళ్లినప్పుడు, అక్కడ ఉండే ఇంటీరియర్ డిజైన్ మనల్ని ఆకర్షిస్తుంది. అయితే, అందరినీ ఆశ్చర్యపరిచే మరియు ఆలోచింపజేసే అంశం ఏమిటంటే.. బాత్‌రూమ్‌లకు గాజు గోడలను (Glass Bathrooms) అమర్చడం. ప్రైవసీకి ప్రాముఖ్యతనిచ్చే ఈ కాలంలో, హోటళ్లు ఎందుకు ఇలా చేస్తున్నాయో మీకు తెలుసా? ఇది కేవలం ఒక డిజైన్ మాత్రమే కాదు, దీని వెనుక ఉన్న మరికొన్ని ఆసక్తికరమైన కారణాలు ఇక్కడ ఉన్నాయి.

గది విశాలంగా కనిపించడానికిహోటల్ గదులు సాధారణంగా పరిమాణంలో చిన్నవిగా ఉంటాయి. బాత్‌రూమ్‌కి సిమెంట్ గోడలను నిర్మిస్తే, గది చాలా చిన్నదిగా, ఇరుకుగా అనిపిస్తుంది. గాజు గోడలు ఉండటం వల్ల గది మరియు బాత్‌రూమ్ రెండూ కలిసిపోయినట్లు అనిపించి, గది మరింత విశాలంగా, వెలుతురుతో మెరుస్తూ కనిపిస్తుంది.
విద్యుత్ ఆదాగాజు గోడల వల్ల గదిలోకి సహజమైన వెలుతురు బాగా ప్రసరిస్తుంది. పగటిపూట కృత్రిమ లైట్లు వాడాల్సిన అవసరం ఉండదు, తద్వారా హోటళ్లు విద్యుత్తును ఆదా చేస్తాయి. ఇది పర్యావరణానికి కూడా మంచిది.
శుభ్రతలో సౌలభ్యంసాధారణ గోడలు లేదా టైల్స్ మీద ఫంగస్ లేదా తేమ (Moisture) చేరే అవకాశం ఉంటుంది, వీటిని శుభ్రం చేయడం కష్టం. కానీ గాజు మీద ఎటువంటి మరకలు పడినా వెంటనే కనిపిస్తాయి, వీటిని కెమికల్స్ లేదా నీటితో క్షణాల్లో శుభ్రం చేయవచ్చు.
ప్రైవసీ మరియు ఇతర కారణాలుప్రతి ఒక్కరూ గాజు బాత్‌రూమ్‌లలో సౌకర్యవంతంగా ఉండకపోవచ్చని హోటల్ యాజమాన్యాలకు తెలుసు. అందుకే, ప్రైవసీ కోసం వీటికి లోపలి లేదా బయటి వైపున రోలర్ బ్లైండ్స్ (పదాలు) లేదా స్విచ్ వేయగానే మసకబారే ‘స్విచబుల్ గ్లాస్’ (Smart Glass) ఉపయోగిస్తారు. ఒక బటన్ నొక్కగానే అది ప్రైవేట్ స్పేస్‌గా మారుతుంది. అలాగే, లైట్లు ఆర్పడం మర్చిపోతే, ఆ వెలుతురు బయటకు రావడం వల్ల గదిలో ఉన్నవారికి తెలిసి, వారు లైట్లు ఆర్పే అవకాశం ఉంటుంది.

Posted

in

by

Tags: