“హాస్టల్‌లో తిండి బాగోలేదు.. ఎన్నిసార్లు అడిగినా వైఫై పాస్‌వర్డ్ ఇవ్వకుండా వేధించారు!” ఆవేశంతో బి.టెక్ విద్యార్థి వేసిన కేసులో సంచలన తీర్పు..!!

గ్రేటర్ నోయిడాలోని ఒక ప్రైవేట్ హాస్టల్‌లో ఉంటూ బి.టెక్ చదువుతున్న ఒక విద్యార్థి, అక్కడ చేరిన కొన్ని రోజులకే అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నాడు.

అక్కడ వడ్డిస్తున్న ఆహారం చాలా నాసిరకంగా ఉండటమే కాకుండా, హాస్టల్ గదులను కూడా సరిగ్గా నిర్వహించడం లేదని విద్యార్థి ఆరోపించాడు. అంతేకాకుండా, హాస్టల్‌లో చేరినప్పుడు ఇస్తామన్న ‘వైఫై’ (Wi-Fi) సౌకర్యం కోసం పాస్‌వర్డ్ అడిగితే, హాస్టల్ యాజమాన్యం అనేకసార్లు అడిగినా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పకుండా తిప్పించుకుంది.

దీంతో విసిగిపోయిన సదరు విద్యార్థి, అక్కడ చేరిన కేవలం 7 రోజుల్లోనే హాస్టల్ ఖాళీ చేశాడు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన విద్యార్థి, హాస్టల్ యాజమాన్యం చేస్తున్న సేవా లోపంపై కాంగ్రా జిల్లాలోని వివాదాల పరిష్కార కమిషన్లో కేసు వేశాడు. తాను చెల్లించిన ఫీజును తిరిగి ఇప్పించవలసిందిగా కోరాడు.

ఈ కేసును విచారించిన Consumer కోర్టు, విద్యార్థికి కనీస సౌకర్యాలు కల్పించడంలో విఫలమైన హాస్టల్ యాజమాన్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. విద్యార్థికి జరిగిన మానసిక వేదనకు పరిహారంగా మరియు కేసు ఖర్చులతో కలిపి మొత్తం 40,000 రూపాయలను విద్యార్థికి తిరిగి చెల్లించాలని Consumer కోర్టు సంచలన తీర్పునిచ్చింది.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *