ఏసీ (AC) వాడుతున్నారా? 90% మందికి తెలియని ‘3 నిమిషాల రూల్’.. ఇది పాటిస్తే కరెంట్ బిల్లు తగ్గుతుంది!

AC మెయింటెనెన్స్: ఎండలో నుంచి రాగానే వెంటనే ఏసీ ఆన్ చేయడం, గది చల్లబడగానే ఆపేయడం చాలా మంది చేసే అలవాటు. కానీ, ఇందులో ఒక ‘3 నిమిషాల రూల్’ ఉంది. దీనిని పాటించకపోతే కంప్రెసర్ పాడైపోవడమే కాకుండా, కరెంట్ బిల్లు భారీగా వస్తుంది.

మనం ఎండలో నుంచి ఇంటికి రాగానే రిమోట్ తీసుకుని ఏసీని 16 డిగ్రీల వద్ద పెట్టి, ఫ్యాన్ ఫుల్ స్పీడ్‌లో ఉంచుతాం. పది నిమిషాల్లో చల్లబడగానే ఆపేస్తాం. మళ్ళీ కొద్దిసేపటికే చెమటలు పడితే వెంటనే ఆన్ చేస్తాం. ఈ ‘ఆన్-ఆఫ్’ ఆట వల్ల కరెంట్ ఆదా అవుతుందని మనం అనుకుంటాం. కానీ, ఏసీ మెకానికులు మరియు కంపెనీ ఇంజనీర్లు చెప్పేది ఏంటంటే, ఈ ఒక్క అలవాటే ఏసీలో అత్యంత కీలకమైన ‘కంప్రెసర్‌’ను పాడు చేస్తుంది. అంతేకాదు మీ జేబుకు కూడా చిల్లు పెడుతుంది.

ఏమిటీ ‘3 నిమిషాల రూల్’? ఏసీలో ఒక రహస్య ‘3 నిమిషాల నిబంధన’ ఉంది. 99% మందికి ఇది తెలియదు. తెలియకపోవడం వల్ల సర్వీసింగ్ ఖర్చులు మరియు ఎక్కువ కరెంట్ బిల్లు రూపంలో నష్టపోతున్నారు. ఈ నియమం చాలా సరళమైనది: ఏసీని ఆఫ్ చేసిన తర్వాత, మళ్ళీ ఆన్ చేయడానికి ముందు కనీసం 3 నిమిషాలు వేచి ఉండాలి. అంటే, మీరు స్విచ్ ఆఫ్ చేసిన తర్వాత, తదుపరి 3 నిమిషాల లోపు మళ్ళీ ఆన్ చేయకూడదు. కోపంతోనో లేదా తొందరలోనో రిమోట్‌ను పదే పదే నొక్కకూడదు.

3 నిమిషాలు ఎందుకు వేచి ఉండాలి? ఏసీకి గుండె వంటిది కంప్రెసర్. ఏసీ లోపల ఉండే గ్యాస్‌ను ఒత్తిడికి గురిచేసి చల్లని గాలిని బయటకు పంపడం కంప్రెసర్ పని. మీరు ఏసీని ఆపివేసినప్పుడు, కంప్రెసర్ లోపల ఒకవైపు అధిక ఒత్తిడి, మరోవైపు తక్కువ ఒత్తిడి ఏర్పడుతుంది. ఆఫ్ చేసిన తర్వాత ఈ రెండు ఒత్తిళ్లు సమాన స్థాయికి రావడానికి 2 నుంచి 3 నిమిషాలు పడుతుంది.

ఈ లోపు మీరు మళ్ళీ ఏసీని ఆన్ చేస్తే, ఒత్తిడి సమతుల్యం కాకముందే కంప్రెసర్ బలవంతంగా పని చేయాల్సి వస్తుంది. ఇంజనీరింగ్ పరిభాషలో దీన్ని ‘షార్ట్ సైక్లింగ్’ అంటారు. దీనివల్ల కంప్రెసర్‌పై విపరీతమైన భారం పడుతుంది. కాలక్రమేణా కంప్రెసర్ బలహీనపడి పూర్తిగా పాడైపోతుంది. కంప్రెసర్ మార్చాలంటే 15,000 నుండి 20,000 రూపాయల వరకు ఖర్చవుతుంది. అంతేకాకుండా, ఒత్తిడి సమానంగా లేకపోవడం వల్ల ఏసీ చల్లబరచడానికి ఎక్కువ విద్యుత్తును తీసుకుంటుంది.

మరో 3 నిమిషాల రూల్: ఏసీ ఆన్ చేసిన తర్వాత మొదటి 3 నిమిషాలు కూడా చాలా ముఖ్యం. ఇంటికి రాగానే 16 డిగ్రీలు, ఫుల్ ఫ్యాన్ స్పీడ్ పెట్టకండి. ఏసీ ఆన్ చేసిన మొదటి 3 నిమిషాలు 24 నుంచి 25 డిగ్రీల వద్ద, మీడియం ఫ్యాన్ స్పీడ్‌లో ఉంచండి. గది కొంచెం చల్లబడిన తర్వాత నెమ్మదిగా 22-23 డిగ్రీలకు తగ్గించండి. దీనివల్ల కంప్రెసర్‌పై ఒక్కసారిగా ఒత్తిడి పడదు. మెషిన్ ఆరోగ్యంగా ఉంటుంది, గది కూడా సమానంగా చల్లబడుతుంది.

ముఖ్యమైన చిట్కాలు:

  • ఇంటికి రాగానే కిటికీలు, తలుపులు మూసివేయండి.
  • ఏసీని 24 డిగ్రీల వద్ద, మీడియం ఫ్యాన్ స్పీడ్‌లో 3 నిమిషాలు రన్ చేయండి. ఆ తర్వాతే అవసరమైతే ఉష్ణోగ్రత తగ్గించండి.
  • బయటకు వెళ్లేటప్పుడు ఏసీ ఆఫ్ చేస్తే, 3 నిమిషాల లోపు మళ్ళీ రాగానే ఆన్ చేయకండి.
  • పిల్లలకు రిమోట్ దూరంగా ఉంచండి.
  • నెలకు ఒకసారి ఏసీ ఫిల్టర్‌ను మీరే శుభ్రం చేయండి. దీనివల్ల కంప్రెసర్‌పై భారం తగ్గుతుంది.

ఈ చిన్న ‘3 నిమిషాల నిబంధనను’ పాటిస్తే, మీ ఏసీ ఆయుష్షు 3 నుంచి 4 ఏళ్లు పెరుగుతుంది. అలాగే, నెలవారీ కరెంట్ బిల్లు సుమారు 20% వరకు తగ్గుతుంది.


Posted

in

by

Tags: