ఆగ్రాలో ఒక భార్య తన కుమార్తెను స్నేహితురాలి ఇంట్లో వదిలిపెట్టి, రహస్యంగా హోటల్‌కు వెళ్లి ప్రియుడితో గడిపిన ఘటన తీవ్ర కలకలం రేపింది.
తన భార్య ప్రవర్తనపై అనుమానం వచ్చిన భర్త, కొద్దిరోజులుగా ఆమెపై నిఘా పెట్టాడు. పక్కా ప్లాన్ ప్రకారం, ఆ రోజు మధ్యాహ్నం కూతురిని బయట వదిలేసి హోటల్‌కు వెళ్లిన భార్యను భర్త వెంబడించాడు. అక్కడ ఆమె తన ప్రియుడితో కలిసి ఉండటాన్ని కళ్లారా చూసి, ఇద్దరినీ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు.
అక్కడికక్కడే భార్యతో తీవ్ర వాగ్వాదానికి దిగిన ఆయన, ఆ దృశ్యాలను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా దావానలంలా వైరల్ అయింది. ఈ ఘటనతో హోటల్‌లో కాసేపు తీవ్ర గందరగోళం, హంగామా నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ముగ్గురినీ పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారించారు.
పోలీసుల విచారణలో.. ఆ దంపతుల మధ్య ఇప్పటికే గృహహింసకు (Domestic Violence) సంబంధించిన వివాదాలు నడుస్తున్నాయని, అయినప్పటికీ వారు ఒకే ఇంట్లో నివసిస్తున్నారని తెలిసింది.
స్టేషన్‌లో గంటల తరబడి జరిగిన కౌన్సిలింగ్, చర్చల తర్వాత ఇరువర్గాలు ఒక ఒప్పందానికి వచ్చారు. దాంతో ఎలాంటి కేసు నమోదు చేయకుండానే రాజీపడి అక్కడి నుండి వెళ్ళిపోయారు. భార్య చేసిన ఈ పని, దాన్ని భర్త ధైర్యంగా వీడియో తీసి నెట్టింట వదిలిన వ్యవహారం ప్రస్తుతం ఆగ్రా ప్రాంతంలో హాట్ టాపిక్‌గా మారింది.

Leave a Reply