“అయ్యయ్యో. పోలీసు భద్రతను కూడా దాటి బద్దలైన ఆగ్రహం.! బాలుడి హత్య నిందితుడికి నడిరోడ్డుపై చెప్పుల దెబ్బ. పుణేను ఊపేసిన వైరల్ దృశ్యం.!”

మహారాష్ట్ర రాష్ట్రం పుణేలోని భారతి విద్యాపీఠ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాట్రాజ్ ప్రాంతంలో బాలుర మధ్య జరిగిన గొడవలో ఒక బాలుడు దారుణంగా హత్యకు గురయ్యాడు.

ఈ కేసులో ప్రమేయం ఉన్న బాలురను పోలీసులు తీసుకెళ్తున్నప్పుడు తీసిన దృశ్యం ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్రంగా వ్యాపిస్తోంది.

వైరల్ అయిన ఆ వీడియోలో, పోలీసులు నిందితులైన బాలురను వాహనం ముందు భాగంలో కూర్చోబెట్టి తీసుకెళ్తుండగా, ఆగ్రహించిన ఒక మహిళ ఆ బాలుడిపై తన చెప్పుతో దాడి చేసిన షాకింగ్ దృశ్యాలు ఉన్నాయి. పోలీసుల భద్రతలో ఉండగానే ఈ దాడి జరిగిన సంఘటన ఆ ప్రాంతంలో తీవ్ర కలకలం రేపింది.

బాలురను బహిరంగ ప్రదేశంలో పోలీసులు తీసుకెళ్లిన తీరు, మహిళ దాడి చేసిన సంఘటనపై డిప్యూటీ కమిషనర్ మిలింద్ మోహితే నాయకత్వంలోని పోలీస్ బృందం విచారణకు ఆదేశించింది. ఈ సంఘటనలో నిబంధనల ఉల్లంఘనకు పాల్పడిన పోలీసులపై తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.


Posted

in

by

Tags: