అక్క మొగుడితో అక్రమ సంబంధం.! “భయంతో కాబోయే భర్తను కూడా మోజు తీర్చుకోవడానికి పిలిచిన యువతి”.. ఆశగా అడవికి వచ్చిన పెళ్లికొడుకు. తర్వాత జరిగిన షాక్..!!

అక్క భర్తపై ఏర్పడిన తీవ్రమైన మోజుతో, తమ అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్న కాబోయే భర్తను, ఒక యువతి తన ప్రియుడితో కలిసి అడవిలో దారుణంగా హత్య చేసిన ఘోర సంఘటన జార్ఖండ్‌లో తీవ్ర కలకలం రేపింది.

జార్ఖండ్ రాష్ట్రం జమువా చోక్ ప్రాంతానికి చెందిన 20 ఏళ్ల యువకుడు నీరజ్, అదే ప్రాంతానికి చెందిన ఊర్మిళ అనే యువతికి పెద్దలు పెళ్లి నిశ్చయించారు. ఇరువైపుల కుటుంబాలు పెళ్లి ఏర్పాట్లలో బిజీగా ఉండగా, ఊర్మిళ మనసులో మరొక విపరీత ప్లాన్ రూపుదిద్దుకుంటోందని పోలీస్ విచారణలో తేలింది.

ఊర్మిళకు ఆమె స్వంత అక్క భర్త అయిన సుభాష్ పాశ్వాన్ అనే వ్యక్తితో కొన్నేళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాలక్రమేణా హద్దులు దాటి అక్రమ సంబంధంగా మారింది. తనకు నీరజ్‌తో పెళ్లి జరిగిపోతే, అక్క భర్తతో నిరంతరం సుఖపడటం సాధ్యం కాదని ఊర్మిళ భయపడింది. దీంతో, తమ అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్న కాబోయే భర్త నీరజ్‌ను పూర్తిగా మట్టుబెట్టాలని ఆ అక్రమ జంట కలిసి ఒక భయంకరమైన ప్లాన్ వేశారు.

దాని ప్రకారం, ఊర్మిళ తన కాబోయే భర్త నీరజ్‌ను సంప్రదించి అటవీ ప్రాంతానికి ఏకాంతంగా గడపడానికి రమ్మని కోరింది. అంతేకాకుండా, “ఎవరికీ చెప్పకుండా నువ్వు మాత్రమే ఒంటరిగా రా” అని ఆశ చూపించే మాటలు చెప్పింది. దీన్ని నిజమని నమ్మిన నీరజ్ ఆమె పిలుపును అందుకుని ఆశగా చెప్పిన అటవీ ప్రాంతానికి వెళ్లాడు. కానీ, అక్కడ తన కోసం వేచి చూస్తోంది మరణమని అతనికి తెలియదు.

అటవీ ప్రాంతంలో ఇదివరకే దాక్కుని ఉన్న ఊర్మిళ, ఆమె ప్రియుడు సుభాష్ పాశ్వాన్ కలిసి, ఒంటరిగా వచ్చిన నీరజ్‌ను చుట్టుముట్టి కత్తితో దారుణంగా పొడిచారు. ఇందులో తీవ్రంగా గాయపడిన నీరజ్, సంఘటనా స్థలంలోనే రక్తం మడుగులో తడబడి జాలిగా ప్రాణాలు వదిలాడు. తర్వాత అతని మృతదేహాన్ని అక్కడే పడేసి ఇద్దరూ పారిపోయారు. నీరజ్ కనిపించకపోవడంతో ఆందోళన చెందిన అతని కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు, పోలీసులు విచారణ చేపట్టారు.

నీరజ్ మొబైల్ ఫోన్ సిగ్నల్ మరియు సాంకేతిక ఆధారాలను విశ్లేషించినప్పుడు, అతని చివరి లొకేషన్ బేలా అటవీ ప్రాంతమని, హత్య జరిగిన సమయంలో ఊర్మిళ మొబైల్ ఫోన్ కూడా అక్కడే ఉందని నిర్ధారణ అయింది. ఈ ఆధారాల ఆధారంగా ఊర్మిళను అదుపులోకి తీసుకుని పోలీసు మార్కు విచారణ జరిపినప్పుడు, అక్క మొగుడి కోసం కాబోయే భర్తను చంపిన పూర్తి సత్యాన్ని ఒప్పుకుని ఏడ్చింది. దీంతో, ఆ అక్రమ జంట ఇద్దరినీ పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు.


Posted

in

by

Tags: