బెంగళూరులోని అవుటర్ రింగ్ రోడ్లో నడుస్తున్న బిఎమ్‌టిసి బస్సులో ఒక మహిళా ప్రయాణికురాలికి లైంగిక వేధింపులు గురిచేసిన వ్యక్తిని ధైర్యవంతురాలైన ఆ మహిళ ఎదురించి పోరాడటంతో పాటు, బస్సు డ్రైవర్ సమయస్ఫూర్తితో వ్యవహరించి ఆ వ్యక్తిని చితకబాదిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
హెబ్బాల్ నుండి మాన్యాటా టెక్ పార్క్ వైపు వెళ్తున్న 500D నంబరు గల ప్రభుత్వ బస్సులో ఈ ఘటన చోటుచేసుకుంది. బస్సులో ప్రయాణిస్తున్న ఒక యువతికి గుర్తుతెలియని వ్యక్తి లైంగిక వేధింపులకు గురిచేశాడు.
అయితే, దేనికీ భయపడిపోకుండా ఆ మహిళ తక్షణమే ఎదురు తిరిగి గళమెత్తింది.
మహిళ కేకలు విని వెంటనే అప్రమత్తమైన బస్సు డ్రైవర్ ప్రవీణ్, వెంటనే వాహనాన్ని నడిరోడ్డుపై నిలిపివేసి ఆ వ్యక్తిని నేరుగా నిలదీశాడు. ఆ సమయంలో ఆ వ్యక్తి డ్రైవర్‌పైనే ఉమ్మివేయడంతో ఆగ్రహానికి గురైన డ్రైవర్ ప్రవీణ్, ఆ వ్యక్తి వైపు దూసుకెళ్లి ఫ్లయింగ్ కిక్ ఇచ్చాడు.
పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లో ఇలాంటి బాధితులు మౌనం వహించకుండా ఎదురు ప్రశ్నించడం, డ్రైవర్ల వంటి సిబ్బంది ధైర్యంగా సహాయం చేయడం నేరాలను అరికట్టడానికి తోడ్పడతాయ అనడానికి ఈ సంఘటన నిదర్శనంగా నిలిచింది.
ఈ ఘటనకు సంబంధించి పోలీసులు వెంటనే జోక్యం చేసుకుని తగిన చర్యలు తీసుకున్నారు.

Leave a Reply