“రా పాపా. నేను చెక్ చేస్తాను.” మైకంలో చిన్నారి. ప్రత్యేక గదిలో పళ్ల డాక్టర్ చేసిన పని.. కోర్టు సంచలన ఉత్తర్వు.!!

అమెరికాలోని అరిజోనా రాష్ట్రంలో ఉన్న పిల్లల దంత వైద్యశాలలో ఎక్స్-రే టెక్నీషియన్‌గా పనిచేసిన డెలోన్ గార్సియా అనే వ్యక్తి, ఆసుపత్రికి వచ్చిన 4 నుండి 6 సంవత్సరాల వయస్సు గల పిల్లలతో తప్పుగా ప్రవర్తించాడు.

పళ్లను పరీక్షించాలని చెప్పి పిల్లలను ప్రత్యేక గదిలోకి తీసుకెళ్లి, వారు మైకంలో ఉన్నప్పుడు లైంగికంగా వేధించడమే కాకుండా అశ్లీల ఫోటోలు కూడా తీశాడు. 6 ఏళ్ల చిన్నారి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ ప్రారంభించారు.

విచారణ సమయంలో, గార్సియా ఫోన్‌ను ఫోరెన్సిక్ నిపుణులు పరిశీలించగా, పిల్లల లైంగిక వేధింపులకు సంబంధించిన ఫోటోలు ఉన్నట్లు నిర్ధారణ అయింది. మొత్తం ముగ్గురు పిల్లలు బాధితులుగా ఉన్న ఈ కేసులో గార్సియా తనపై ఉన్న ఆరోపణలను అంగీకరించాడు. తల్లిదండ్రులు, పిల్లల నమ్మకాన్ని దుర్వినియోగం చేసినందుకు అతనికి 40 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *