నెక్స్ట్ లెవెల్ టాలెంట్..! చెత్త నుండి తయారవుతున్న రోబోలు. నిజంగా మెచ్చుకోవాల్సిందే. యంగ్ సైంటిస్ట్ రెడీ. భవిష్యత్తులో ఫ్యూచర్ ప్రకాశవంతంగా ఉండబోతోంది.!!!

నేటి ఆధునిక డిజిటల్ యుగంలో పిల్లలు ఎక్కువ సమయాన్ని సెల్‌ఫోన్లు, గేమింగ్‌లోనే గడుపుతున్న తరుణంలో, కేరళ రాష్ట్రానికి చెందిన లెవిన్ పాలినోస్ అనే బాలుడు వృథాగా పారేసే ఎలక్ట్రానిక్ వస్తువులతో అత్యాధునిక రోబోలను తయారు చేసి ప్రపంచ దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు.

కేరళకు చెందిన ఈ చిన్నారి, తన అసాధారణ సాంకేతిక నైపుణ్యంతో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ హీరోగా మారాడు.

సాధారణంగా పిల్లలు ఆటల్లో మునిగి తేలే వయస్సులో, లెవిన్ పాలినోస్ పాత ఎలక్ట్రానిక్ వ్యర్థాలు, వాడేసిన ప్లాస్టిక్ వస్తువులు, పారేసిన విడిభాగాలను సేకరించడాన్నే తన హాబీగా చేసుకున్నాడు. వ్యర్థ పదార్థాలే కదా అని నిర్లక్ష్యం చేయకుండా, వాటికి ఒక క్రమపద్ధతి తీసుకొచ్చి, తన ఆలోచనలతో ప్రాణం పోసి స్వయంచాలక (ఆటోమేటిక్) పద్ధతిలో పనిచేసే పలు రకాల రోబోలు, కార్లు మరియు ఆధునిక సాంకేతిక పరికరాలను తయారు చేశాడు.

కేరళకు చెందిన లెవిన్ పాలినోస్ తాను తయారు చేసిన వివిధ రకాల రోబోటిక్ పరికరాలను నడిపిస్తూ ప్రాక్టికల్‌గా వివరించే వీడియో ఒకటి సోషల్ మీడియాలో విడుదలటై ప్రస్తుతం దావానలంలా వ్యాపిస్తోంది. వ్యర్థ పదార్థాలను పర్యావరణానికి హాని కలగని విధంగా ఉపయోగకరమైన పరికరాలుగా మార్చే ఈ బాలుడి పునర్వినియోగ ప్రయత్నాన్ని, అపార మేధస్సును నెటిజన్లు ఆశ్చర్యంతో ప్రశంసిస్తున్నారు.

బాలుడు లెవిన్ పాలినోస్ అసాధారణ ప్రతిభను కొనియాడుతున్న నెటిజన్లు, భవిష్యత్తులో ఇతడు గొప్ప ఇంజనీర్‌గా, ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఆవిష్కర్తగా ఎదుగుతాడనడంలో ఎలాంటి సందేహం లేదని చెబుతున్నారు. పారేసిన వ్యర్థాల నుండి కూడా ఉపయోగకరమైన ఆవిష్కరణలు చేయవచ్చని నిరూపించిన లెవిన్ సాధన, ఎంతో మంది యువ తరానికి మంచి స్ఫూర్తిగా నిలిచింది.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *