“ఓ మై గాడ్.. ఇది గ్రాఫిక్స్ కాదా..?” విండోస్ వాల్‌పేపర్ ఒక నిజమైన ప్రపంచ ప్రదేశమా..? వైరల్ అవుతున్న న్యూజిలాండ్ సముద్ర తీరం వీడియో..!!!

ఒకప్పుడు ల్యాప్‌టాప్ కలిగి ఉండటమే ఒక గొప్ప విషయంగా భావించిన రోజుల్లో, దాని పనితీరును మించి ప్రజలను ఎక్కువగా ఆకట్టుకున్నది అందులో వచ్చే అందమైన వాల్‌పేపర్‌లే.

ముఖ్యంగా, సముద్రం, గుహ మరియు ఇసుక తిన్నెలతో కూడిన ప్రసిద్ధ విండోస్ వాల్‌పేపర్ ఎందరో మనసులను దోచుకుంది.

చాలామంది ప్రజలు ఈ దృశ్యాన్ని ఒక ఆర్టిస్ట్ వేసిన పెయింటింగ్ లేదా కంప్యూటర్‌లో తయారు చేసిన గ్రాఫిక్స్ అని ఇన్నాళ్లూ భావించారు. కానీ, అది ఊహ కాదు, నిజమైన ఒక ప్రదేశమని నిరూపించే వీడియో ఒకటి ప్రస్తుతం ఇంటర్నెట్‌లో విడుదలటై వైరల్ అవుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిలియన్ల కొద్దీ విండోస్ వినియోగదారులు ప్రతిరోజూ చూసే ఆ ప్రసిద్ధ వాల్‌పేపర్ దృశ్యం, న్యూజిలాండ్‌లో ఉన్న ‘వారారికీ’ సముద్ర తీరం.

సముద్ర తీరంలో ఉన్న బ్రహ్మాండమైన సహజ సిద్ధమైన రాళ్లు, సముద్ర గుహలు మరియు వాటి మధ్య కనిపిించే మహాసముద్రం ఈ తీరపు అందాన్ని మరింత పెంచుతున్నాయి. సాగర్ మరియు ఆమీ అనే ఇంటర్నెట్ ట్రావెల్ క్రియేటర్లు, తమ ల్యాప్‌టాప్ స్క్రీన్‌పై ఉన్న వాల్‌పేపర్‌ను, దానికి ఎదురుగా ఉన్న నిజమైన వారారికీ సముద్ర తీరాన్ని పోల్చి చూపిస్తూ వీడియోగా పోస్ట్ చేసి ఈ సందేహాన్ని పటాపంచలు చేశారు.

ఆ వీడియోలో, తమ ల్యాప్‌టాప్ స్క్రీన్‌పై ఉన్న ఫోటోను చూపించి మెల్లగా కెమెరాను జరిపినప్పుడు, అదే సముద్రం, అవే గుహలు మరియు అవే రాతి నిర్మాణాలు నిజంలో అచ్చం అలాగే కనిపిస్తాయి. ఇది చూసిన ఆ మహిళ ఆశ్చర్యంతో నోరెళ్లబెడుతుంది. వారారికీ సముద్ర తీరం ఫోటోలు ఎడిట్ చేసినవని తాము భావించామని, కానీ నేరుగా చూసినప్పుడు అక్కడి ఇసుక దిబ్బలు, సముద్ర వంపులు వేరొక ప్రపంచంలోకి వెళ్లిన అనుభూతిని ఇచ్చాయని వారు భావోద్వేగంతో రాసుకొచ్చారు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *