“10 ఏళ్ల క్రితం ప్రేమ”.. పెళ్లై ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత ఉపాధ్యాయుడి విపరీత కోరిక.. 6 నెలల క్రితం పెళ్లైన ప్రియురాలిని అర్ధరాత్రి వేళలో. ఊరంతా ఒక్కటై జరిపించిన విచిత్ర వివాహం.!!!

బీహార్ రాష్ట్రం సమస్తీపూర్ జిల్లాలో జరిగిన ఒక విచిత్రమైన సంఘటన సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

పెళ్లైన ఒక మహిళను కలవడానికి ఆమె పాత ప్రియుడు అర్ధరాత్రి వేళ రహస్యంగా ఇంటికి వచ్చినప్పుడు, ప్రజలకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయారు. దీనిని గ్రామ పంచాయితీ తీసుకున్న నిర్ణయంలో, ఆ మహిళకు ఇదివరకే పెళ్లయిన విషయాన్ని పక్కన పెట్టి, పాత ప్రియుడితోనే రెండవ పెళ్లి జరిపించిన ఘటన అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది.

ఖగరియా జిల్లాకు చెందిన అనురాధ కుమారి అనే మహిళకు, ఉపాధ్యాయుడైన పన్నా లాల్ యాదవ్ అనే వ్యక్తికి గత 10 ఏళ్ల క్రితం పరిచయమేర్పడి ప్రేమగా మారింది. పన్నాకు తల్లిదండ్రులు వేరొకరితో పెళ్లి జరిపించినప్పటికీ, వీరి సంబంధం కొనసాగింది. ఇదిలా ఉండగా నర్సింగ్ కాలేజీలో చేరిన అనురాధతో కాలేజీ ఉద్యోగి అయిన మనోహర్ కుమార్ అనే వ్యక్తికి ప్రేమ చిగురించి, గత ఆరు నెలల క్రితం వారిద్దరూ చట్టబద్ధంగా పెళ్లి చేసుకున్నారు.

పెళ్లి తర్వాత తన భర్తతో నివసిస్తున్న అనురాధను వెతుక్కుంటూ వచ్చిన పాత ప్రియుడు పన్నా లాల్, గత కొన్ని రోజులుగా ఆమెతో మళ్లీ మాట్లాడటం ప్రారంభించాడు. ఈ విషయం తెలుసుకున్న భర్త, కుటుంబ సభ్యులు అప్రమత్తమవ్వగా, ఒకరోజు అర్ధరాత్రి అనురాధ ఇంటికి పన్నా లాల్ రహస్యంగా వచ్చినప్పుడు ఊరి ప్రజలు వారిని చుట్టుముట్టి పట్టుకున్నారు. మరుసటి రోజు ఉదయం గ్రామంలో జరిగిన పంచాయితీలో, భర్త సమ్మతితో పన్నా చేతనే అనురాధ నుదుటన సింధూరం పెట్టించి, తాళి కట్టించి రెండవ పెళ్లి జరిపించారు.

ఈ విచిత్రమైన పెళ్లి దృశ్యాలతో కూడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదివరకే పన్నా లాల్‌కి పెళ్లై భార్య, ఇద్దరు పిల్లలు ఉన్న నేపథ్యంలో, పంచాయితీ తీసుకున్న ఈ అనాలోచిత తీర్పు చట్టపరంగా ఎక్కడికి దారితీస్తుందనే ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు, జిల్లా యంత్రాంగం తరఫున ఇప్పటివరకు ఎలాంటి అధికారిక వివరణ ఇవ్వకపోవడం గమనార్హం.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *